ప్రకృతి
>> Tuesday, March 11, 2008
ఓ తొలిసంధ్య వేళ...
నిదురమ్మ ఒడిలో సేదతీరుతున్న
నన్ను కోయిలమ్మ లేపగా
అప్పుడు...
రూపే లేని సర్వేశ్వరుడు
అనంతమైన ఆకాశంలో నిగూఢుడై ఉండగా
గిరులే ధూపమేయగా
నేలమ్మే స్వరాలాపన చేయగా
మేఘాలే నాట్యమాడగా
ఆ దృశ్యం నే చూడగా
నా మనసే నైవేద్యంగా
ఆ దైవానికి నేనర్పించగా
చిరుజల్లుల రూపంలో
అభయమందించాడు ఆ భగవంతుడు.
2 comments:
just amazing. ఇంత మంచి కవితను చదివి, చాలా కాలమైంది.
గిరిచంద్ గారు ధన్యవాదములు
Post a Comment