స్త్రీ - సంద్రం
>> Monday, March 10, 2008
అంతులేని అలల సమాహారం
పాలనురగల సమ్మేళనం
నీలిరంగుకు నిర్వచనం
ధీరగంభీరమైన సంద్రం
కోటికలలకు నిలువుటద్దం
గత చరిత్రకు మూలకారణం
అన్యులకు అర్దమవని స్వేచ్చావిహంగం
ఆడదాని హృదయం
కడలి గర్భంలో ఎన్నో సంపదలు
ముదిత మనసులో వేల ఆలోచనలు
సుడిగుండాలు సహజం సాగరాన
సుఖ దుఃఖాలనేకం సుదతి జీవితాన
ఎగిరి పడే అలకు తీరమే గమ్యం
అదిరిపడే అతివకు భాగస్వామే బలం
ఎన్నో జీవుల జీవం సాగర గర్భం
వంశాకుర బందం స్త్రీ గర్భం
సూర్యోదయాన కడలి సౌందర్యం
సిగ్గు మొగ్గైనప్పుడు ప్రమద అందం
ఏ కవి వర్ణన కు సాధ్యం?
సౌందర్యం, సంపద లభ్యమయ్యే సముద్రాన్ని
చేస్తున్నాం మన పాద స్పర్శతో మలినం
అందం, లక్ష్మీకళతో కలగలిసిన ముగ్ద మనోహరం
ఆక్షేపణలతో, కట్టుబాట్లతో అణచేస్తుంది సమాజం
పుడమి భారానికి పెనుభూతం భూకంపం
జలధి వికటాట్టహాసం త్సునామి తాండవం
కరుణాతప్త హృదయం కోల్పోతే కరుణారసం
జరిగే విలయ తాండవం కన్నుల జ్వాలాతోరణం
జగతంతా ఆ జ్వాలకి ఆహుతవ్వడం ఖాయం.
4 comments:
జాహ్నవి గారు...చాలా గొప్పగా ఉంది మీ కవిత. ఎంతంటే ఆ సముద్రమంత అని మాత్రం చెప్పగలను.
గిరిచంద్ గారు ధన్యవాదములు
Jahnavi garu.. idi varaku nenu sthreelanu nadhulatho, purushulanu sandraalatho kudina polikalaney chadivaanu. ippudu mee kavitha chala interesting ga undi. Edi Emaina.. meeku naa dhanyavaadaalu..
spidy గారు ధన్యవాదములు
Post a Comment