పగలు, రాత్రి సమానంగా ఉండే రోజు మళ్లీ వచ్చేసింది...

>> Thursday, September 22, 2011

అవునండీ.. సంవత్సరంలో పగలు,రాత్రి సమానంగా ఉండే రోజు ఈ ఒక్కరోజే. అందుకే ఈరొజు నుండే సూర్యమానం ప్రకారం తులా రాశి మొదలు అవుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అని అనుకుంటున్నారా? మరి ఈ రోజే కదా నేను పుట్టింది. అందుకే ఈ రోజు గురించి ఇంత పరిశోధన.

చిన్నప్పటి నుండి పుట్టిన రోజు అంటే అందరిలానే నాకు కూడా చాలా ఇష్టం. క్లాసులో పుస్తకాల బరువు పెరుగుతున్న కొద్దీ పుట్టిన రోజు మీద ఆసక్తి తగ్గుతూ వచ్చింది. కానీ ఒక కల మాత్రం మిగిలిపోయింది. ఇంక అది తీరదు అని తెలిసిపోయింది అందుకే నా బ్లాగులో వ్రాసేసుకుంటున్నాను. అదేమితంటె.. అర్దరాత్రి సరిగ్గా పన్నెండు గంటలు దాటగానే నాకు బోల్డన్ని ఫోన్ కాల్స్ వచ్చేయాలని, చాల మంది నాకు విషెస్ చెప్పేయాలని కోరిక.. ఒకసారో, రెండు సార్లో అలా జరిగింది. అది కూడా బోల్డన్ని కాదు ఒకటో, రెండో... ఇంక ఈ ఉద్యోగాలలోకి వచ్చాక... పుట్టిన రోజు విషయమే గుర్తు ఉండటం లేదు.. మొత్తానికి చదువుకునేటప్పుడు ఉండే పట్టుదల, ఓపిక, ధైర్యం, ఆశావాహ దృక్పధం అన్నీ ప్రస్తుతం కొరవడ్డాయి నాలో. జీవితమంతా చప్పగా, చేదుగా ఏదోలా ఉంది. కొత్త విషయాలు నేర్చుకోలేనందుకు చప్పగా... ఎంత కష్టపడినా అనుకున్న వాటిలో సగభాగం కూడా సాధించలేనందుకు చేదుగా అనిపిస్తుంది ఈ జీవితం.
ఎప్పుడు ఎలా ఉన్నా.. తీపి మీది మక్కువతో ఉదయించే సూర్యుని చూస్తూ.. ప్రతీ రొజూ ఆశతో ఆశయసిద్ది కోసం ప్రయత్నించడం అలవాటయిపోయింది. ప్రస్తుతానికి నా మనసు, నా ఆలోచనలు కూడా.. ఈ పోస్టు లానే అస్పష్టం గా ఉన్నాయి...

సర్వేజనా సుఖినోభవంతు...

Read more...

ఈ చిన్నారికి మనమందరం ఉన్నామని ధైర్యం చెప్తామా??

>> Saturday, September 10, 2011



ఈ పై ఫొటో లో కనిపిస్తున్న ఈ చిన్నారి పేరు ప్రతీక్. ఈ బాబు వయసు కేవలం ఆరు నెలలు కానీ నూటికో కోటికో ఒక్కరికి వచ్చే అప్లాస్టిక్ అనీమియా అనే వ్యాదితో భాధ పడుతున్నాదు. ప్రస్తుతం వేలూరు లో సి.ఎం.సి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బోన్ ట్రాన్స్ప్లంటేషన్ వలన బాబు కి వ్యాధి నయం అవ్వవచ్చు అని చెప్పారు. దాదాపు ఇరవై నుండి పాతిక లక్షలు వరకూ ఖర్చు ఉంటుందని వైద్యులు చెప్పారు. వారి తల్లిదండ్రులు మద్యతరగతి వారే.
ప్రస్తుతం వారు బోన్ ట్రాన్స్ప్లంటేషన్ కి దాత కోసం మరియు ధన సహాయం చేయగలిగే దాతల కోసం చూస్తున్నరు. మీకు తెల్సిన ఏమైనా సంస్తలు ఇలాంటి కష్టాలలో వున్నవారిని ఆదుకోవడానికి ముందుకు వస్తే ఆ సంస్త వివరాలు తెలియచేయగలరు. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఈ క్రింది బ్లాగుని పూర్తి వివరాలకై చూడగలరు.
http://www.help-prateek.blogspot.com/

Read more...

విహంగ లో నా కధ

>> Tuesday, September 6, 2011

నేను వ్రాసిన కధ విహంగలో మొదటి సారి వచ్చింది.
ఇక్కడ నొక్కి చూడండి.

Read more...

Back to TOP