మౌనం

>> Sunday, March 9, 2008

నీ కోసం నేనని చెప్పేవేళ
నా గొంతు మూగబోయింది

నయనాలు ఊసులాడాయి
మౌనమే భావమయింది

నిశీధే నేస్తమై నా చుట్టూ అల్లుకుంటే
వెలుగురేఖలా నీ ఆగమనం
మార్చింది నా జీవన విధానం

11 comments:

yadavalli vsn sharma March 9, 2008 at 6:53 AM  

అవునండీ..మీ పేరునెలా పలుకుతారు.. "జాహ్ నవి"...అనా లేక.. "జాన్ హవి"..అనా
ఎక్కువ మంది "జాహ్ నవి" అని పలకటం విన్నాను...కానీ సరైన పద్ధతి.."జాన్ హవి" లేదా "జాన్ వి"

జాహ్నవి March 9, 2008 at 7:37 AM  

శర్మ గారు మీరు చెప్పింది నిజం సార్ అందరూ నన్ను "జాహ్ నవి" అనే పిలుస్తారు. కాని తెలుగు నిఘంటువు లో మాత్రం పలికేవిధానం "జాన్ హవి" లేక "జాన్ వి" అనే ఉంది. కాని తెలుగులో ఎలా వ్రాస్తామో అలాగే పలుకుతాం కదా సార్. మరి ఈ పేరుకెందుకు ఇలా వ్రాయడం ఒకలా పలకడం ఒకలా మీకేమైనా idea ఉందా సార్. తెలిస్తే చెప్పగలరు.

రాధిక March 9, 2008 at 7:55 AM  

మీ కవితలు అన్నీ చదువుతున్నాను.నా ఆలోచనలు,భావాలు మీవాటికి చాలా దగ్గరగా వున్నట్టు అనిపిస్తాయి.ఒక్కోసారి నేను బిజీగా వున్నప్పుడు నా మనసు చదివేసి నాకన్నా ముందు రాసేసారా అనిపిస్తుంది.:)

జాహ్నవి March 9, 2008 at 10:10 AM  

రాధిక గారు ధన్యవాదములు. మీ blog నేను చూశాను madam. మీ ఆలోచనలతో నా ఆలోచనలని పోల్చినందుకు ధన్యవాదములు. అది నిజం కాదని తెలిసినా చాలా ఆనందంగా ఉంది. ఒక్కో సారి అబద్దం కూడా మనసుని ఆహ్లాదపరుస్తుంది కదా madam.

yadavalli vsn sharma March 9, 2008 at 10:13 AM  

'హ' కింద 'న' వత్తు వచ్చినప్పుడు మాత్రం...చదివేటప్పుడు ' న' కింద ' హ' వత్తు వున్నట్టుగా చదువుతాము..కారణం సరిగ్గా తెలియదు కానీ...కొన్ని వుదాహరణలు యివ్వగలను..
ఆహ్నికము-ఆన్ హికము
మధ్యాహ్నము-మధ్యాన్ హము
బ్రాహ్మీముహూర్తము-బ్రామ్హీముహూర్తము
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంలోనిది.. "ఉత్తిష్టనరశార్దూల కర్తవ్యం దైవమాన్ హికం"

జాహ్నవి March 9, 2008 at 10:21 AM  

శర్మ గారు మీ విశ్లేషణకి ధన్యవాదములు

yadavalli vsn sharma March 9, 2008 at 10:25 AM  

అసలు విషయం చెప్పటం మరిచిపోయానండి.....

మీ కవితలు చాలా బావున్నాయి..

- యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ

నువ్వుశెట్టి బ్రదర్స్ March 9, 2008 at 10:34 AM  

చాలా బాగుంది. మీ కవితలు క్లుప్తంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి. వాటికి తగ్గ బొమ్మకూడా పెడితే ఇంకా మనసుకి హత్తుకుంటాయి.

జాహ్నవి March 9, 2008 at 10:35 AM  

శర్మ గారు ధన్యవాదములు సార్

జాహ్నవి March 9, 2008 at 10:36 AM  

గిరిచంద్ గారు ధన్యవాదములు ఆ అతుకు పని లోనే వున్నా సార్ ప్రయత్నిస్తున్నా సార్.

yadavalli vsn sharma March 15, 2008 at 10:52 AM  

జాహ్నవి గారూ...
యింకొక్క వుదాహరణ దొరికింది..
చిహ్నము(వ్రాయునపుడు) - చిన్ హము(చదువునప్పుడు)

యింతకుముందు యిచ్చిన వుదాహరణలు..
ఆహ్నికము-ఆన్ హికము
మధ్యాహ్నము-మధ్యాన్ హము
బ్రాహ్మీముహూర్తము-బ్రామ్హీముహూర్తము

Back to TOP