ప్రతీక్ ఇంక లేడు..

>> Wednesday, October 19, 2011

ప్రతీక్ గురించి ఇదే మొదటి సారి చూడడం అయితే ఒక్కసారి ఈ లింక్ ని చూడండి.

నేను అప్పుడప్పుడు ప్రతీక్ వాళ్ల బంధువులకి ఫోన్ చేస్తూ ఆ పిల్లవాడి క్షేమ సమాచారం తెలుసుకునేదాన్ని. ప్రతీ సారి ఆరోగ్యం మెరుగు పడుతుందనే చెప్పేవారు. పరిస్తితి ఆశాజనకం గానే ఉందని సంతోషించాను. డోనర్ కూడా దొరికారు అతితక్కువ కాలంలోనే...నిజంగా అదృష్టమనుకున్నాను. కానీ ఒకరోజు కొంచెం సీరియస్ అన్నారు. ఆ తర్వాత పని వత్తిడిలో పడి నేనే వాళ్లకి కాల్ చేయలేదు. వాళ్ల బ్లాగు కూడా చూడలేదు. ఈరోజే మళ్లీ బ్లాగు చూసేసరికి ఈ వార్త... ఒక్కసారి కూడా ఆ అబ్బాయిని చూడని నాకే ఇంత భాధ అనిపిస్తుంటే... ఇంక వారి అమ్మా, నాన్నలకి ఎలా ఉంటుందో...

ప్రతీక్ ఆత్మకి శాంతి చేకూరాలని.....
ఆ తల్లిదండ్రులు ఈ భాధ నుండి తేరుకుని మామూలు ప్రపంచంలోనికి రావాలని మనస్పూర్తిగా ఆ పైవాణ్ణి కోరుకుంటున్నాను.

Read more...

కౌముది లో నా యాత్రా స్పెషల్ - అన్నవరం

>> Sunday, October 16, 2011

అప్పుడెప్పుడో ఒకసారి పక్కన వున్న అన్నవరానికి వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలు కౌముది వారి యాత్రా స్పెషల్ లో ఈ నెల ప్రచురితమైనాయి. ప్రచురించినందుకు కౌముది వారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదములు తెల్పుకుంటున్నాను.
ఇక్కడ నొక్కి కౌముది కి వెళ్లగలరు.

Read more...

సంక్రాంతి టు విజయ దశమి

>> Thursday, October 6, 2011

నావరకైతే ఈరొజే సంక్రాంతి నుండి దసరా వరకు ఉన్న అన్ని పండుగలు వచ్చాయి. అప్పుడెప్పుడో సంక్రాంతికి మా యింటికి వచ్చాను, మళ్లీ ఇప్పుడు వచ్చాను. ఈ మధ్యలో ఉన్న పండుగలు అన్నీ మిస్ అయ్యాను :-( నాకెంతో ఇష్టమైన ఉగాది పండుగను కూడా.. :-( ఈ మూడు రోజులు భక్తితో పూజలు చేసుకుని, కంటి నిండా నిద్ర పోయి, కడుపు నిండా భోజనం చేసి రాజభోగాలు అనుభవించేశా.. ఈ శనివారం మళ్లీ వెళ్లిపోవాలి..:-( ఆ చల్లారిపోయిన చప్పటి చపాతీలు తింటూ ఉండాలి..:-( రోజూ మన వంటలే తింటే వాటి రుచుల్లో గొప్పతనం తెలియదని దేవుడు నన్ను అంత దూరం పడేశాడేమో మరి :-( ఏది ఏమైనా.. జరిగేదంతా మంచికని .. అనుకోవడమే మనిషి పని.. (ఇప్పుడు నేను అంత కన్నా చేయగలిగింది కూడా ఏమీ లేదు) నా బ్లాగు చూసిన వారందరికీ విజయ దశమి శుభాకాంక్షలు. మా యింట్లో ఈరోజు దసరా జరుపుకున్న ఫొటో..

Read more...

Back to TOP