కవిత్వం - కవితత్వం

>> Saturday, March 8, 2008

అనంతమైన ప్రకృతి అందాన్ని
అంతులేని ఆలోచనా సాగరాన్ని
మనస్సులోని అంతర్మధనాన్ని
నభూతోన్న భవిష్యత్తుగా చిత్రించి
అక్షరబద్దం చేయడమే కవిత్వం
అంతటి అందమైన కవిత్వాన్ని
స్వచ్చమైన మనసుతో
నిష్కళంక ప్రేమతో
ఆరాధించడమే కవితత్వం

6 comments:

నువ్వుశెట్టి బ్రదర్స్ March 8, 2008 at 8:56 AM  

జాహ్నవి గారు, మీ కవిత్వం బాగుంది. ఏ కవిత్వానికైనా చక్కని బొమ్మని జోడిస్తే ఆ కవిత్వం ఇంకా ఎక్కువగా పరిమళిస్తుంది. ఉదాహరణకి రాధిక గారి http://snehama.blogspot.com/ చూడండి.

జాహ్నవి March 9, 2008 at 3:31 AM  

గిరిచంద్ గారు మీ సలహాకు ధన్యవాదములు. తప్పక ఆచరిస్తాను.

valluri March 9, 2008 at 9:43 AM  

చక్కటి కవిత బాగుంది. జాహ్నవి గారు! మీరు మీ అక్షరతుణీరం నుంచి మరిన్ని కవితలు సంధించండి.

జాహ్నవి March 9, 2008 at 9:59 AM  

వల్లూరి గారు ధన్యవాదములు. నా కవిత కన్నా మీ comment చాలా బాగుంది సార్.అక్షరతుణీరం ఎంత బాగుందో పదం.

అభి.బి March 11, 2008 at 1:08 AM  

నువ్వుశేట్టి బ్రదరూ కవిత్వానికి బొమ్మలు జోడించాలా? గొప్ప అవిడియానే. పోతనకూ, శ్రీశ్రీకి ఇది తట్టకపోవడం వారి తక్కువ తెలివికి గుర్తు.

వల్లూరి....సంధుల్లేని సంధానాలెందుకటా?

జాహ్నవి...అక్శరతూణీరమన్న పదానికే అంత ఇదైపొతే ఎట్టా?

జాహ్నవి March 11, 2008 at 3:30 AM  

అభి.బి గారు
మొదట మీరు తెలియని మనిషిని పిలిచేటప్పుడు గారు వాడండి. ఘాటుగా ఉందా సార్ ఈ మాట.

మీకు వీలైతే సంధులు,సంధానాలు గురించి 2 వాక్యాలు వ్రాయండి.2 వాక్యాలలో తేల్చేయడం కుదరదని మాత్రం చెప్పవద్దు సార్.

ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పదం నచ్చుతుంది. దానికి వారు ఏదో అవ్వచ్చు. అది వారి ఇష్టం.

కవిత్వానికి బొమ్మలు బంగారానికి సువాసన వంటివి.పోతన గారి భాగవతాన్ని ఇప్పుడు యువతకి అందించాలంటే publishers బొమ్మల్ని add చేయడంలేదా సార్?

Back to TOP