నాన్నంటే.... ఓ ధైర్యం

>> Sunday, June 21, 2009


నాన్న... ఈ మాటంటే మన పెదవులు దూరమవుతాయి. ఎందుకంటే మనల్ని మనసుతో ప్రేమించి చేతల్తో భయపెడతాడు నాన్న. అందుకే పెదవులు సైతం ఆ మాట పలికేటప్పుడు దూరమవుతాయి.

అమ్మ గురించి ఎంతో వ్రాయగలం. కాని నాన్న గురించి అంత వ్రాయలేం కారణం నాన్న ప్రేమని మనసులోనే దాచేసుకుంటారు అలానే మనం కూడా నాన్న మీద ప్రేమని వ్యక్తపరచలేం.

నా దృష్టిలో అమ్మంటే ఓర్పు, సహనం ; నాన్నంటే ధైర్యం.

ఎందుకంటే తల్లి దూరమైన లేదా తల్లి లేని వాతావరణంలో పెరిగిన పిల్లల్లో చాలా మందికి ఓర్పు తక్కువగా ఉంటుంది.
తండ్రి దూరమైన పిల్లల్లో ధైర్యం తక్కువగా ఉంటుంది. పెద్దయ్యాక ధైర్యం వచ్చినా చిన్నప్పుడు వారు కొంచెం పిరికి వారు గానే ఉంటారు. ఆడపిల్లల విషయంలో ఇది 96% నిజం.

నాన్నకి ఇది ఇష్టం ఉండదు. ఇలా చేస్తే నాన్న కొడతారు , తిడతారు అని చెప్పి అమ్మే ఎక్కువగా మనల్ని భయపెడుతుంది. లేకుంటే పిల్లలు తల్లి తండ్రులలో ఎవరికీ భయపడరని. కాని అమ్మ దగ్గర ఆటలు సాగనప్పుడు నాన్న దగ్గరకే వెళ్తాం కదా మనం. అదే నాన్న ప్రేమ.

పిల్లల పెంపకంలో తల్లి తండ్రులిరువురూ సమాన పాత్ర పోషించాలి. లేదంటే పిల్లల్లో సహనమో, ధైర్యమో తక్కువవుతుంది.

నా ఎదుగుదలలో మా అమ్మ పాత్ర ఉంది. మా నాన్న పాత్ర కూడా ఉంది. కాని ఇద్దరి పాత్ర పూర్తి వ్యతిరేకం. :-)

నాన్న కోసం ఎంతో వ్రాయాలని అనుకున్నా. కాని ఏమీ వ్రాయలేకపోతున్నా........ :-(

పితృ దినోత్సవ మహోత్సవ సందర్బంలో ఒక పాట..
http://www.chimatamusic.com/playcmd.php?plist=1668

(స్పీకర్స్ సరిలేక పాట కోసం కష్టపడుతున్న సమయంలో జ్యోతి గారి సహాయం మరువలేనిది. ధన్యవాదములు)
(చిత్రపటాన్ని ఇచ్చిన గూగులమ్మకి ధన్యవాదములు)

Read more...

Back to TOP