ఎదురుచూపు

>> Thursday, March 13, 2008

ఊహాజనితమైన నా కవితకు
ఊహకందని రీతిలో
ఊతమిచ్చిన నా ప్రియమైన ప్రేయసి...
నీకే ఈ కవిత అంకితం
అని అంటుంది నా హృదయం
ఆ మాటనే వ్రాసింది నా కలం

నా ఊహలో జీవం పోసుకుని
భువిలో కనిపించి
కలలో సైతం కలవరం లేపి
నా తీయని వేదనకు కారణమైన నీవు
నన్ను వరించేది ఎప్పుడు?

1 comments:

నువ్వుశెట్టి బ్రదర్స్ March 14, 2008 at 11:49 AM  

మళ్ళీ మళ్ళీ ఇలాంటి కవితలు అందించినప్పుడు.

Back to TOP