జ్యోతి గారి పుట్టిన రోజు

>> Tuesday, December 21, 2010

జ్యోతి... తెలుగు బ్లాగు లోక౦లో ఈ పేరు తెలియని వారు ఉ౦డర౦టే అతిశయోక్తి కాదేమో...
చదువుకు నిజమైన సార్దకత ఉద్యోగ౦ మాత్రమే కాదు అన్నది ఆర్యోక్తి. ఈ ఉవాచకి అచ్చమైన తెలుగి౦టి ఉదాహరణ మన జ్యోతి గారే.
ఒక బ్లాగుతో క౦ప్యూటరాభ్యాస౦ చేసి, బ్లాగు వెనక బ్లాగులను మొదలుపెట్టి, బ్లాగు గురువుగా ఎదిగినటువ౦టి జ్యోతి గారి గురి౦చి ఈ ఒక్కపేజీలో చెప్పడ౦ అనేది కొ౦డని అద్ద౦లో చూపడమే.
ఒకేసారి పది బ్లాగులను విజయవ౦త౦గా నిర్వహి౦చడ౦ అనేది ఎ౦త ఓపిక + తెలివితో కూడుకున్న పనో మనకు తెలియనిది కాదు.
ఒక వ్యక్తిగత బ్లాగుని లక్ష మ౦దికి పైగా వీక్షి౦చారు అన్న విషయ౦ ఒక్కటి చాలు ఆమె వ్రాతల విలువ తెలుసుకోవడానికి.
సాదారణ గృహిణి అన్న పదానికి అసాధారణ వ్యక్తిత్వ౦ కల్పి౦చే మగువలలో మన జ్యోతి గారు ము౦దు వరుసలో ఉ౦టార౦టే నమ్మని వారు ఎవరు౦టారు?

కొత్త ఆలోచనల రూప శిల్పి
నిర౦తర జ్ఞానాన్వేషి
నిత్య విద్యార్థి
బ్లాగు గురువిని
మా మ౦చి జ్యోతి.

జ్ఞాన వెలుగులు విరజిమ్మే జ్యోతికి

aజన్మదిన శుభాకా౦క్షలుb

తెలుపుతూ కానుకగా ప్రమదావన౦ తరపున ఒక చిన్న వెబ్ సైట్. వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్కండి.

Read more...

ఈ - టిప్

>> Saturday, November 6, 2010

04 - 11 -2010 న ఈనాడు ప్రత్రికలో ఈ - టిప్

Read more...

ఈ - టిప్

>> Thursday, September 23, 2010


23 - 09 -2010 న ఈనాడు ప్రత్రికలో ఈ - టిప్

Read more...

ఈ రోజు తీయనిది...

>> Wednesday, September 22, 2010

చిన్నప్పుడు ..... అంటే... చాలా చిన్నప్పుడు... ఈ ఎక్కాలు ఎవడు కనిపెట్టారు రా బాబు... అని అనుకుంటున్నప్పుడు... నాకు పుట్టిన రోజు అంటే చాలా సరదా ఇంకా ఇష్టం ఉండేది. చక్కగా కొత్త బట్టలు వేసుకోవచ్చు. బోల్డన్ని చాక్లెట్లు తినేయవచ్చు. ఎంత అల్లరి చేసినా ఆ రోజు ఏమీ అనరు. ( తర్వాతి రోజు పుట్టిన రోజు నాడు అల్లరి చేసినందుకు తిట్టేవారనుకోండి .. అది వేరే విషయం.. అలాంటివి మీరు అడగకూడదన్నమాట)

అప్పట్లో జనవరిలో కొత్త కాలెండర్ వచ్చిన వెంటనే ముందుగా నా పుట్టిన రోజు ఏ రోజు వచ్చేదో చూసుకునేదాన్ని. ఆదివారం కాకపోతే పండగే. మరి ఆ రోజు పుట్టినరోజు వస్తే ఫ్రెండ్స్ ముందు పుట్టినరోజు ఫోజ్ కొట్టడానికి అవ్వదు కదా ... కొద్ది కొద్ది గా కాలం గడుస్తుంది. మనకి ఎక్కాలన్నీ వచ్చేసాయి. అర్దం కాని లెక్కలు కూడా చేసేయవలసి వచ్చింది. ఎన్ని సూత్రాలని గుర్తు ఉంచుకుంటాం ?? మనకి కాలం కలసి రాక కాలం, దూరం లెక్కలు వచ్చాయి. మామూలు వడ్డీ లెక్కలే అర్దం కావడం లేదంటే చక్రవడ్డీ, బారు వడ్డీ లెక్కలు కూడా వచ్చాయి. వీటి తర్వాత కాలెండర్ లెక్కలు వచ్చాయి. వీటిలో మాత్రం మనమే ఫస్ట్. చిన్నప్పటి నుండి నా పుట్టిన రోజు కోసం కాలెండర్ చూసి ...చూసి... ఒక విషయం తెల్సుకున్నా.. అదేమిటంటే.. ఈ సంవత్సరంలో సెప్టెంబర్ 23 లక్ష్మి వారం వస్తే తర్వాతి సంవత్సరానికి ఒక్క రోజు కలుపుకుని శుక్ర వారం వస్తుంది. అదే తర్వాతి సంవత్సరం లీపు సంవత్సరం అయితే రెండు రోజులు కలపాలి అప్పుడు శనివారం పుట్టిన రోజు వస్తుంది. ఎలాంటి సూత్రాలు లేకుండా నేను ఈ విషయం తెల్సుకున్నాను. కానీ ఈ విషయం చెప్పడానికి మా స్కూల్ లో రెండు క్లాసులు తీసుకున్నారు. ఎప్పుడూ లానే కొందరికే అర్దం అయ్యింది. ఆ కొందరి లో నేను లేను ఎందుకంటే మనకి సూత్రాలు గుర్తు ఉంచుకోవడం కష్టమయ్యేది. కాలం అలా భారంగా గడిచిపోతుంది. ఈ లెక్కలు నన్ను విడిచి పోను అంటున్నాయి. మొత్తానికి పి. జి. ఎంట్రన్స్ ఎగ్జామ్ వ్రాయడానికి ప్రిప్రరేషన్ కి ఒక కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యా.. అక్కడ షార్ట్ కట్ లో లెక్కలు చెప్పేవారు. ఎంత పెద్ద లెక్క అయినా ఒకటి, రెండు స్టెప్పుల్లో అయిపోయేది. ఈ కాలం , దూరం లెక్కలు, వడ్డీల లెక్కలు అప్పుడే నేర్చుకున్నా కొంచెం లో కొంచెం .. కానీ ఇక్కడ కూడా ఆ కాలెండర్ లెక్కలు బాగా చెప్పలేదు. అయినా మనకి ప్రోబ్లం లేదు ... కాలెండర్ లెక్కల్లో మనం గుడ్ కదా....

ఇంతకీ నాకు అప్పుడు తెలిసొచ్చింది ఏమిటంటే.. మనకి మనం ఇష్టపడి చదివితే ఎదైనా గుర్తు ఉంటుందని.. ఇలా సూత్రాల మీద ఆధారపడితే ఎమీ సరిగ్గా రావని

ఇంతకీ ఈ అర్దం కాని లెక్కల కోసం ఇంత సేపు మిమ్మల్ని విసిగించాను కదా... అది ఎందుకంటే.. ఈరోజే నా పుట్టినరోజు..

మరి నాకు శుభాకంక్షలు చెప్తారు కదా.. మీ విషెస్ కోసం నిలువెల్లా కన్నులతో కాకుండా.. ఒక నాలుగు కళ్లతో ఎదురు చూస్తూ వుంటాను.

అన్నట్టు ఈరోజు మరో విశేషం కూడా ఉందండి.. అదేమిటంటే.. సంవత్సరంలో పగలు, రాత్రి సమానంగా వచ్చేది ఈ రోజే..



Read more...

ఈ - ప్రశ్న కి నా సమాధానం

>> Thursday, September 16, 2010



16 - 09 -2010 న ఈనాడు ప్రత్రికలో ఈ - ప్రశ్న కి నా సమాధానం

Read more...

నేను మొబైల్ కొన్న కొత్తలో....

>> Sunday, September 12, 2010

అందరి లానే నాకు మొబైల్ అంటే ఇష్టం ఉండేది మొదట్లో... కానీ భయం ఎక్కువ... ఎందుకంటే.. దాని ఆపరేషన్ రాదు మరి నాకు... ఎట్టకేలకి కొన్ని తప్పనిసరి పరిస్తితులలో మొబైల్ కొన్నాను... మామూలు మొబైల్ కాదు...కె...మె...రా... మొబైల్... చిన్నప్పటి నుండి కెమెరాను కూడా చూడని మొహమేమో నాది... నా మొబైల్ అంటే...నాకు ....భలే ఇష్టం ఉండేది... రోజుకి తక్కువలో తక్కువ ఒక పాతిక వరకూ ఫొటోస్ ని తీసేదాన్ని.. అలా మొబైల్ కొన్న కొత్తలో.. ఒకసారి ఒక బుక్ షాప్ కి వెళ్తే " మాయా బజార్ " సినిమా పుస్తకం కనిపించింది. ఇంట్లో కొనమంటే... కొనరు కదా ( ఈ పెద్దోళ్లు ఉన్నారే...) ఆ పుస్తకానికి అట్ట అదిరిపొయింది. నట దిగ్గజాలు ఉన్నారు మరి ఆ అట్ట మీద... మన దగ్గర మొబైల్ ఉంది కదా.... పండగ చేసుకున్నా.. ఫొటోస్ తీసి... అవే ఇవి...





ఆ సినిమాలో సావిత్రి ని మించిన హీరో ఎవరు చెప్పండి??
ప్రతీ సినిమాలో N.T.R. కి S.V.R. తండ్రి గానో బాబాయి గానో నటిస్తారు.. కానీ ఈ సినిమాలో మాత్రం N.T.R. నటించారు S.V.R. మామయ్యలా.. బహుశా.. ఇలా ఈ ఒక్క చిత్రంలోనే నేమో...

Read more...

చిన్ని బాబు కి సాయం కావాలి...

>> Saturday, September 11, 2010

" క్రానియోసైనోసిస్ " అనే వ్యాదితో బాధ పదుతున్న ఒక చిన్నారికి ఆపరేషన్ నిమిత్తం పెద్ద మొత్తంలో ఆర్దిక అవసరం ఉంది.

ప్రస్తుతం చిన్నారి పరిస్తితి....



పేపర్ కట్టింగ్స్....



సాయం చేయాలనుకునే వారు చిన్నారి తల్లినే డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయవచ్చు..
ఆమె పేరు, నెంబరు : సత్యశ్రీ - 9492091926
ప్రస్తుతం వీరు హైదరాబాదులో వున్న ఎల్. బి. నగర్ లో ఉంటున్నారు...
దయచేసి మీ అమూల్యమైన సహాయాన్ని వారికి అందిచండి. మీరు ఇచ్చే చిన్న మొత్తమైనా... వారికి ఉపయోగపడుతుంది.
మీరు ఇచ్చే చిన్న మొత్తం
ఆ చిన్నారికి ఇచ్చును ప్రాణం...



Read more...

మీ మొబైల్ ని ఉచితంగా రీచార్జ్ చేసుకోవాలనుకుంటున్నారా ??

మన మొబైల్ ని మనమే రీచార్జ్ చేసుకోగలిగినా... ఇలా ఒక సైట్ ద్వారా ఉచితంగా రీచార్జ్ చేసుకుంటే... ఏదో ఒక ఆనందం కదా... ఏంటీ ఈ ఆనందం అనుకుంటున్నారా?? ఐతే ఒక్కసారి ఇక్కడ రిజిస్టర్ అవ్వండి.

Read more...

వినాయక చవితి.... నా చిన్నప్పుడు

>> Friday, September 10, 2010


అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు...

వినాయక చవితి అంటే.. చిన్నప్పుడు భలే సరదా... భయం రెండూ ఉండేవి..
సరదా ఎందుకంటే.. చాలా రకాల ప్రసాదాలు తినేయవచ్చు. స్కూలు కి శెలవు వస్తుంది. ఇక భయమెందుకంటే.. పూజ సరిగ్గా చేయకపోతే.. దేవుడికి కోపమొచ్చేస్తుందంట !!! అసలే వినాయకుడు.. అతనికి కోపమొస్తే... ఇంక అంతే సంగతులు.. చదువుకు మధ్య లోనే విఘ్నం వచ్చేస్తుందంట.. ఎన్ని చెప్పేవారో ఈ పెద్దోళ్లు...

వినాయక చవితి పూజ కి మా ఇంట్లో పుస్తకాలకి కూడా పూజ చేసేవాళ్లం.. ఇక నా కన్ఫ్యుజన్ చూడాలి... మొత్తం మేటర్ వున్న టెక్స్త్ బుక్స్ పెట్టాలా లేదా చక్కగా జవాబులు ఇచ్చే గైడ్ పెట్టాలా లేక సెకండ్ హాండ్ షాప్ లో సంవత్సరం మొదటిలోనే కొనేసిన ఆల్ ఇన్ వన్ (ఈ పుస్తకం నా దగ్గర ఉన్నట్టు మా స్నేహితులకి తెలీదన్నమాట నిజానికి వాళ్ల దగ్గర అప్పటికే ఉన్న విషయం నాకూ తెలియదు ) పెట్టాలా లేదా ముందు సంవత్సరం పరీక్షలకి ఇచ్చిన ప్రశ్నా పత్రాన్ని వ్రాసుకున్న పుస్తకం పెట్టాలా?? ఇన్ని సందేహాల మధ్య నేనుంటే... మా అమ్మ ఏమో.. ఇక్కడ వంటింట్లో ఇంత పని ఉంటే అక్కడ ఒక నాలుగు పుస్తకాలు తీయడానికి ఎంత సేపు అని కాస్తంత అతి ప్రేమతో పిలుపు... పోనీ ఆ వంటిట్లోకి వెళ్లి ఏదో చేసేద్దాం అనుకుంటే... ఆ ఆకు ఇలా మడత పెట్టాలి.. ఆ కజ్జి కాయలో ఇంతే కొబ్బరి పెట్టాలి.. అని ఆర్డర్స్.. పూజ అయినంత వరకూ ఏమీ తినకూడదని ..మా అమ్మ ముందు రోజు ఒక వంద సార్లు చెప్పేది .. అందుకే ఆ రోజు మరీ ఆకలి వేసేది.. అమ్మా.. ఆకలి వేస్తుంది.. త్వరగా పూజ చేసేయొచ్చు కదా... అంటే... నా వర్క్ షిఫ్ట్ వంటింటి నుండి గుమ్మాల దగ్గరకి మారేది.. గుమ్మాలకి పసుపు రాసి.. తోరణాలు కట్టాలి.. పసుపు రాయాలంటే.. కిందకి వంగి చేయాలి.. మనకి నడుం వంగదు.. తోరణాలు కట్టాలంటే... నేనెమైనా స్వయంవరం సినిమాలో వేణు నా?? ఎక్కడో అల వైకుంటపురంలో వున్న గుమ్మం టాప్ కి శ్రమ కోర్చి తోరణం కడితే..ఆకులు మంచివి చూసి ముడి వేయవా... అని మళ్లీ మా అమ్మ.... మొదలుపెడుతుంది... ఇలా... కష్టపడి ఎట్టకేలకు పూజ కి కూర్చున్న తర్వాత... మనం తెలుగు మీడియం కాబట్టి ..పూజా విధానం భాద్యతలు నాకే వచ్చేవి.. నేను సూపర్ ఫాస్ట్ గా చదివేస్తూ ఉంటే... మా అమ్మ ఎర్ర జండా పట్టుకుని ఊపుతూ ఉంటుంది... మొత్తానికి పూజ కానించి మద్యాహ్నానికల్లా... బ్రేక్ ఫాస్ట్ చేసే వాళ్లం. సాయత్రం బోల్డన్ని గుళ్ల కెళ్లి ఎన్నో గుంజీళ్లు తీసే వాళ్లం.. అలా దేవుడికి ఇష్టం అంట.. చీకటి పడకుండానే ఇంటికి వచ్చి .. మళ్లీ పూజ చేసేసి.. రాత్రికి పళ్లు తినేసి నిద్రపోయేవాళ్లం. హోం వర్క్ చేయాల్సిన పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసేసే దాన్ని.. చక్కగా హోంవర్క్ చేయవలసిన అవసరం ఉండేది కాదు :-) ఆ తర్వాత రోజు స్కూల్లో వీపు విమానం మోతే మరి... :-(

ఇలా భలే సరదాగా ఉండేది.. వినయక చవితి అంటే.. అప్పుడు అమ్మ పనులు చేయమని చెప్పినప్పుడు.. ఏదో లా అనిపించినా.. ఇప్పుడు ఉద్యోగం కోసం ఊరు మారాక... ఇంటి విలువ.. ఇంకా చాలా చాలా తెలిశాయి... :-( :-)

అందరికీ మరొక్క సారి వినాయక చవితి శుభాకాంక్షలు.

Read more...

రంజాన్ శుభాకాంక్షలు


ఎదుటి మనిషిలో దేవుణ్ణి చూసే ప్రతీ ఒక్కరికీ... రంజాన్ శుభాకాంక్షలు..

Read more...

కన్నయ్యా......

>> Friday, September 3, 2010




కాస్త ఆలస్యంగా చెప్తున్నా.. కన్నయ్యా...
ఏమీ అనుకోకు...
నువ్వేమీ అనుకోవు... నాకు తెలుసు...

ఎందుకంటే...

నువ్వు..

నా కన్నయ్యవి కదా..... :-)

Read more...

రాఖీ శుభాకాంక్షలు

>> Monday, August 23, 2010

Read more...

ఈ - ప్రశ్న కి నా సమాధానం

>> Wednesday, July 21, 2010




22 - 07 -2010 న ఈనాడు ప్రత్రికలో ఈ - ప్రశ్న కి నా సమాధానం

Read more...

మీ నెట్ యొక్క వేగాన్ని తెలుసు కోవాలనుకుంటున్నారా ??

>> Saturday, June 19, 2010

నెట్ యొక్క వేగాన్ని తెలుసు కోవాలంటే ఈక్రింది సైట్ కి వెళ్ళండి..




మనం ఎక్కడ వున్నాం అనే విషయాన్ని కూడా తెలియ చేస్తూ.. మనం వాడుతున్న ఇంటర్నెట్ సర్వీసు యొక్క డౌన్లోడ్ మరియు అప్లోడ్ వేగాన్ని తెలియచేస్తుంది

Read more...

ఈ - ప్రశ్న కి నా సమాధానం

>> Friday, April 30, 2010




29 - 04 -2010 న ఈనాడు ప్రత్రికలో ఈ - ప్రశ్న కి నా సమాధానం

Read more...

ఈ - ప్రశ్న కి నా సమాధానం

>> Thursday, April 15, 2010




15 - 04 -2010 న ఈనాడు ప్రత్రికలో ఈ - ప్రశ్న కి నా సమాధానం

Read more...

ఈ - ప్రశ్న కి నా సమాధానం

>> Saturday, April 3, 2010



1 - 04 -2010 న ఈనాడు ప్రత్రికలో ఈ - ప్రశ్న కి నా సమాధానం

Read more...

ఈ - టిప్

>> Thursday, January 28, 2010



28 - 01 -2010 న ఈనాడు ప్రత్రికలో ఈ - టిప్

Read more...

ఈ - ప్రశ్న కి నా సమాధానం

>> Wednesday, January 20, 2010




21 - 01 -2010 న ఈనాడు ప్రత్రికలో ఈ - ప్రశ్న కి నా సమాధానం

Read more...

ఇది హాస్యమా ?? మన జీవితమా ??

>> Wednesday, January 6, 2010

సీత : ఏంటి వదినా?? పదే అవుతుంది కదా !! ఎక్కడికో వెళ్తున్నట్లు ఉన్నావ్??
గీత : అవును వదినా .. బ్యాంక్ కి వెళ్తున్నా...
సీత : పండగ కదా.. ఎదైనా వస్తువు చేయించుకుంటున్నావా వదినా??
గీత : చేయించుకునేట్టే ఉన్నాయా ధరలు ?? పిల్లలికి బస్ పాసులు, కూరగాయలు కొనడానికి బ్యాంక్ నుండి డబ్బులు డ్రా చేయడానికి వెళ్తున్నా...
సీత : అవునొదినా .. ఒకప్పుడు బంగారం కొనాలంటే బ్యాంకుకెళ్లి డబ్బులు తేవాల్సి వచ్చింది. ఇప్పుడో కూరగాయలకి, బస్ చార్జీలకి కూడా బ్యాంకుకెళ్లి డబ్బులు తీయాల్సొస్తుంది.
గీత : మరేం..
సీత : బస్ స్టాప్ అటువైపైతే ఇటువైపొస్తున్నావేంటొదినా??
గీత : నిన్న న్యూస్ చూడలేదా ఇప్పుడు బస్ ఎక్కితే అయిదు కాయిన్ సమర్పించాలట. నడిస్తే ఆరోగ్యం + డబ్బులు మిగులని ఇలా....
సీత : ఓ అరగంట ఆగుతావా వదినా ?? నేను వస్తాను.
గీత : అయ్యో వదినా .. మనలాంటి వాళ్లందరూ ప్రతీ అవసరానికి బ్యాంక్ కి వెళ్లడం వలన బ్యాంక్ లు కూడా R.T.C. బస్ ల్లాగా తయ్యరయ్యయ్. లేట్ ఐతే అంతే సంగతులు.
సీత : అవునా .. వదినా..
గీత : మరేం...
సీత : ఇంతకీ ఒకేసారి ధరలెందుకు రెట్టింపు కన్నా పెరిగాయంటావొదినా??
గీత : బ్యాంకు నుండి వచ్చి చెప్తా వదినా .. టైమైపోతుంది.
సీత : అలాగే..

Read more...

ఈ - ప్రశ్న కి నా సమాధానం



07 - 01 -2010 న ఈనాడు ప్రత్రికలో ఈ - ప్రశ్న కి నా సమాధానం

Read more...

Back to TOP