తీయని కల

>> Saturday, March 8, 2008

ఉన్నాయి నాకెన్నో కలలు
అయ్యాయి కొన్ని నిజాలు
ఔతాయి రేపటికి మరికొన్ని సత్యాలు
తారలెన్ని ఉన్నా చంద్రుడొక్కడే
కలలెన్ని ఉన్నా మహత్తరమైనదొక్కటే
కష్టాలెన్నింటినో ఓర్చి
సమస్యలనెదిరించి
నన్ను పెంచిన మా అమ్మని
నా కష్టంతో పోషించాలని
కన్నాను ఓ చిన్ని కలని
శ్రమిస్తున్నా అది నిజమవ్వాలని
నాకు తెలుసు అది సాకారమౌతుందని
ఎందుకంటే....
ముక్కోటి దేవతల దీవెనను మించిన
మా అమ్మ ఆశీస్సు నాకుందని.

2 comments:

జాగృతి March 8, 2008 at 8:45 PM  

జాహ్నవి గారూ

సేవ చేయాలనే మీ సంకల్పబలం, కష్ట పడాలనే మనస్తత్వం, పట్టుదల, శ్రమ మీ ఈ పవిత్రమైన కలను సాకారం చేస్తాయి. అతి త్వరలో మీరు ఈ గమ్యాన్ని చేరుకునేలా అన్ని శక్తి సామర్ధ్యాలు మీకు ఒనగూడాలని మనసారా కోరుకుంటున్నాను

జాహ్నవి March 9, 2008 at 3:30 AM  

జాగృతి గారు ధన్యవాదములు

Back to TOP