తొలి సంద్య

>> Wednesday, March 12, 2008

తొలిసంధ్య వేళలో చూస్తే ప్రకృతి అందాలు
మదిలో మెదలుతాయి కొత్త అలోచనలు

అప్పుడే తన లేలేత కిరణాలతో మన
మగతను వదలగొట్టే సూర్య భగవానుడు
తూర్పు దిక్కు నుండి తొంగి చూడగా

ఆహారం కోసం పక్షులు గూళ్ళను విడిచిపెట్టి
కిలకిలమంటూ అన్వేషణ సాగించగా

ఆకాశాన్నంటుతున్నాదేమో అన్నట్టు ఎగసిపడే
అలను తన కౌగిలిలో హత్తుకున్న సాగరుడు

మంచు పుష్పాల మాదిరి రాత్రి కురిసిన
మంచును తమ రెక్కపై ఉంచుకున్న పుష్పాలు

ఈ ప్రకృతి అందాలన్నీ మనం
తొలిసంధ్య వేళలోనే చూడగలం.

3 comments:

జాహ్నవి March 12, 2008 at 10:59 AM  

జాగృతి గారు ధన్యవాదములు. మీ సలహా తప్పక పాటిస్తాను.మరో కవిత తప్పక వాస్తాను ధన్యవాదములు.

gk March 12, 2008 at 11:22 AM  

jahnavi garu
me kavita chala bagundi.

జాహ్నవి March 12, 2008 at 11:32 AM  

gk గారు ధన్యవాదములు

Back to TOP