అ - అః రాఖీ
>> Wednesday, March 12, 2008
అ- అన్నా చెల్లెళ్ల బంధానికి నెలవిది
ఆ- ఆప్యాయంగా అందరూ కలిసే రోజిది
ఇ- ఇరవై ఒకటో శతాబ్దంలోనూ మరువనిది
ఈ- ఈమెయిల్స్ గాను పంపే విషయమిది
ఉ- ఉత్తర,దక్షిణ భారతదేశాల్లో జరుపుకొనేది
ఊ- ఊకదంపుడు విషయం కాదిది
ఋ- ఋతువులెన్ని వచ్చినా
ఎ- ఎన్నడూ మరివనిది
ఏ- ఏ మనిషినైనా మైమరపించేది
ఐ- ఐదుగురు అన్నలున్నా
ఒ-ఒక్క సోదరి లేకుంటే
ఓ- ఓ సోదరుడా నీకు లేదు రాఖీ
ఔ-ఔరా అని నీ మనసును కలచివేస్తుంది
అం- అందరి మన్ననలు పొందిన రాఖీ
అః- అః అని అందరి చేత అన్పిస్తుంది రాఖీ
అన్నల మణికట్టుపై మెరుస్తుందీ రాఖీ.
3 comments:
అ అంటే అమలాపురం...వంటి పనికిమాలిన పాటలే మనసుని డామినేట్ చేస్తున్నాయి. బాగుంది మీ సరళి.
గిరిచంద్ గారు ధన్యవాదములు
ఈ మధ్య బ్రహ్మకుమారీలనే శాఖ బయలుదేరి భర్తక్కూడా రాఖీ కట్టమని చెబుతున్నారు.
Post a Comment