FAREWELL PARTY

>> Monday, February 18, 2008

కదిలిపోయే కాలం మద్య
వీడలేని బందాన్ని ఏర్పరచుకొని
వీడ్కోలు చెబుతూ
వెళ్ళిపొతున్నవా నేస్తం

ప్రతి కలయిక వీడ్కోలుకు నాంది
అంటూమరోసారి కలవాలంటే
నేడు విడిపోక తప్పదంటూ
హ్రుదయాంతరాలలొ
స్నేహ హస్తాన్నిపదిలంగా దాచుకుంటూ
నాతొ కరచాలనం చేస్తూ
మమ్ములను వీడి వెళ్ళిపోతున్నావా నేస్తం


మొక్క అనే అభిమానంలొ
నీరు అనే అనే ప్రేమను పొసి
పూవు అనే మమకారం పెంచుకొని
చెట్టు అనే స్నేహబందాన్ని ఏర్పరచుకొని
ఇప్పుడు వెళ్ళిపొతున్నవా నేస్తం

తిరిగిరానివి ఈ కాలేజీ రోజులు
మరచిపొలేనివి ఈ కాలేజీ రోజులు
అటువంటి ఈ కాలేజీ జీవితాన్ని ముగించి
కొందరు ఉద్యోగాల వేటలొ
మరికొందరు ఉన్నత చదువుల ఉబలాటంలో
ముందుకు సాగుతూ
రాబోయే కాలంలొ ఒడిదొడుకులను తట్టుకొంటూ

పాతజ్ఞాపకాల నీలినీడలలొ
కష్ట సమయంలొ కూడా
చిరునవ్వులు చిందిస్తూ
నలుగురినీ నవ్విస్తూ
నవ్వులపాలు కాకుండా
వందమందిలొ ఒక్కరివి కాకుండా
వందమందిలొ ఒక్కరిగా ఉంటూ
భారతావనికి నీవంతు సేవ చేస్తూ
దేశభివ్రుద్దిలో నీవు పాలు పంచుకొవాలని ఆశిస్తూ...

0 comments:

Back to TOP