మినీ కవితలు - 6

>> Tuesday, February 19, 2008

భర్త
భరించే వాడి నుండి
భాధించే స్డాయి కి
ఎదిగిన వాడు
అమ్మ
బాల్యం లో ధైర్యం
యవ్వనం లో అవసరం
ప్రౌఢం లో తలనొప్పి
ఉమ్మడి కుటుంబం
కలిసుంటే
కలవని మనసులు
విడిపోతే
అతకని బ్రతుకులు

6 comments:

Naveen Garla February 19, 2008 at 9:15 PM  

* అసలు భర్త 'భరించే'టంత బరువు మోపుట ఎందులకు? తరువాత బాధించెన్నన్న బాధ ఎందులకు. సిసలైన ప్రేమకు లొంగని ప్రాణి అరుదు కదా.

* తల్లి 'తలనొప్పా'? ఎంత మాట ఎంత మాట. ఎంత సేవ చేస్తే ఆమె ఋణం తీర్చుకోగలం?

(http://gsnaveen.wordpress.com)

జాహ్నవి February 20, 2008 at 8:57 AM  

నవీన్ గారు
ప్రేమించే భార్యలున్నా వారిని భాధించే భర్తలు ఎంతో మంది ఉన్నారుగా సార్
తల్లి బ్రతికి ఉన్నంత వరకు ఆమెని పోషించాల్సిన పిల్లలు ఆమెని తలనొప్పి అని కొన్నిసార్లైనానుకోని వారు ఎంత మంది ఉంటారు సార్.

Valluri Sudhakar February 20, 2008 at 8:59 AM  

మీ మినీకవితలు బాగున్నాయి. ఆయితే, కొన్ని పదాలు అంతగా అమరలేదనిపించింది.
భర్త: భాదించే స్థాయికి 'ఎదగటం' కాదు, అది 'దిగజారటం'
అమ్మ: యవ్వనంలో 'అవసరం' కన్నా, 'ఆసరా' ఎక్కువ.

జాహ్నవి February 20, 2008 at 9:34 PM  

వల్లూరి గారు
ధన్యవాదములు. నేను ఈ మధ్యనే మినీ కవితలు వ్రాస్తున్నా మీ సలహాను శిరసావహిస్తాను.

Naveen Garla February 20, 2008 at 9:48 PM  

@వల్లూరు గారు,
ఈ కవిత లో 'ఎదగినవాడు' అంటే నాకు సందర్భాన్నిబట్టి అది దిగజారినవాడనే ధ్వనిస్తోంది. బహుశా కవయిత్రి అలాంటి భర్తలను దెప్పిపొడవడానికి ఈ మాట ఉపయోగించి ఉండచ్చు. పెద్దలను ఎదిరించిన పిల్లలను "చాలా పెద్దవాడివి ఐపోయావురా", "చాలా ఎదిగిపోయావురా" అని అనటం చూశాము కదా!! ఏమంటారు.
పిల్లలకు రెక్కలొంచేత వచ్చేంత వరకూ కూడా తండ్రి, పెళ్ళయేంత వరకు తల్లి అవసరమే. కాకుంటే చిన్న పిల్లలకు అవసరం కన్నా అసరా ఎక్కువ కావల్సి రావచ్చు.

@జాహ్నవి గారు,
నిజమే...భార్య విలువ తెలియని భర్తలు, తల్లిని ఇంటి నుంచి తరిమేసే కొడుకులు ఎంతో మంది ఉన్నారు. కానీ మీరు భర్తకు, అమ్మకు నిర్వచనం ఇస్తున్నట్టనిపించి అలా వ్యాఖ్యానించాను. ఈ ఆధునిక యుగంలో తల్లికి నిర్వచనం అలా తయారవడంలో ఆశ్చర్యం లేదు.
- నవీన్ గార్ల
( http://gsnaveen.wordpress.com )

జాహ్నవి February 21, 2008 at 2:56 AM  

నవీన్ గార్ల గారు
ధన్యవాదములు

Back to TOP