ప్రేమలేఖ
>> Friday, February 15, 2008
"ప్రియా ఓ ప్రియా"
"నువ్వే నువ్వే" నా "మనసంతా నువ్వే" అని "నీతో" నా "మనసులో మాట" "చెప్పాలని వుంది". నిన్ను "కలుసుకోవాలని" నువ్వు "హలో I LOVE YOU" అంటే "వినాలని వుంది". "అంతపురం" లో ఉండే "నీ ప్రేమకై" "వేచివుంటా". "ప్రేమంటే" ఏమిటో చెప్పి ఈ "చంటబ్బాయి"ని "గడుగ్గాయి"లా మర్చావు. "ప్రేమికుల రోజు"న "నువ్వు నేను" కలిసి "హైదరాబాదు"లో "ఫిల్మ్ సిటి"ని "చూడాలని వుంది".
"నీ ప్రేమకై"
xxx
REPLY LETTER
"ప్రియమైన నీకు"
మన "ప్రేమ"కు "ఆస్తులు - అంతస్తు"ల "కులగోత్రా"ల ప్రమేయం లేదు. "మల్లెపూవు" కన్నా తెల్లనైన "నీ మనసు నాకు తెలుసు". "నువ్వు నాకు నచావు" "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" "నిన్నే పెళ్ళాడతా" అని అంటే మా "శాంతి నివాసం"లో అందరూ మన పెళ్ళి కి అంగీకరించారు. "ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్" లో "నీ కోసం" "రోజా పూలు"తో "వేచివుంటా". "ప్రేమతో రా".
"ప్రేమతో"
yyy
0 comments:
Post a Comment