మినీ కవితలు - ౩

>> Sunday, February 17, 2008

ఏకాకి
’నా’ వాళ్ళని
వదిలేస్తే గాని
విజయం
వరించలెదు నన్ను
మనం
కళ్ళు మూస్తే ఋషి
మాట్లాడితే యోగి
మౌనం వహిస్తే జ్నాని
నవ్వితే భోగి
ఇవన్నీ ఉంతే మహర్షి
ఏవీ లేకుంటే మనిషి
మగవాడి ఆలోచన
భయపడితే
అణుకువ
ఎదిరిస్తే
బరితెగింపు
అన్నదే స్త్రీ తత్వం

4 comments:

పద్మనాభం దూర్వాసుల February 18, 2008 at 4:28 AM  

జాహ్నవిగారూ
మీ బ్లాగు చక్కగా ముస్తాబై వచ్చింది. సంతోషం.
చిన్న టైపు పొరపాటు: ఇవన్నీ ఉంటే మహర్షి అని ఉండాలి
శుభాకాంక్షలు
దూర్వాసుల పద్మనాభం

జాహ్నవి February 18, 2008 at 9:21 PM  

ధన్యవాదములు పద్మనాభం గారు తెలుగు టైపు నాకు కొత్త అందుకే పొరపాటు దిద్దుకుంటాను సార్

Naveen Garla February 18, 2008 at 9:50 PM  

~m~naani = ఙ్ఞాని

(Inscriptలో ఐతే నేరుగానే వ్రాయచ్చు)

(http://gsnaveen.wordpress.com)

జాహ్నవి February 19, 2008 at 7:54 AM  

ధన్యవాదములు నవీన్ గారు నేను బరహ వాడుతున్నాను మీరు చెప్పినట్టు టైప్ చేస్తే నాకు రాలేదు సార్.

Back to TOP