A - Z Good Qualities

>> Friday, February 29, 2008

ఈ క్రింది లక్షణాలతో మనిషి ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.
అవి :
A - Ability - సామర్ధ్యం
B - Bravery - సాహసం
C - Courage - ధైర్యం
D - Desire - కోరిక
E - Efficiency - సమర్ధత
F - Fellowship - సౌభ్రాతృత్వం
G - Generosity -ఔదార్యం
H - Hope - నమ్మకం
I - Interest - ఆసక్తి
J - Justice - న్యాయం
K - Kindness - దయ
L - Loyalty - విశ్వాసం
M -Man-Hood - మానవత్వం
N - Novel - నూతన
O - Obedience - విధేయత
P - Politeness -మర్యాద
Q - Quickness - చురుకుదనం
R - Rememberence - జ్ఞాపకం ఉంచుకొను
S - Satisfaction - తృప్తి
T - Trial - ప్రయత్నం
U - Unity - ఐకమత్యం
V - Vitality - ఉత్సాహం
W - Wisdom - తెలివి
X -Xenodochy - ఆతిధ్యం
Y - Yearn - ఆపేక్ష
Z - Zeal - పట్టుదల

ఈ పై లక్షణాలన్నీ మనిషి అలవరచుకుంటే తప్పకుండా ఆ మనిషి మహర్షే అవుతారు.
ఈ పై కలబోతలన్నీ నా స్వంతంగా నేనే వ్రాశాను.

వధువు కావలెను

>> Saturday, February 23, 2008

ఓ పెద్ద కంపెనీలో ఆకర్షణీయమైన జీతము అందుకుంటున్న వరునకు అందమైన, చురుకైన, P.G. చదివిన వధువు కావలెను.
ఏడడుగుల బంధానికి వధువుకు ఉండవలసిన ఏడు లక్షణాలు:
1)ఆస్తిలేమీ లేకపోయినా అప్పులుండకూడదు. కాని హైదరాబాద్ లో ఓ యిల్లు, లేదా 2,3 చోట్ల స్థలాలు ఉంటే చాలు.
2)అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఒకరు ఉంటే మంచిది. లేకుంటే మరీ మంచిది.
3)వరునికి ఇష్టం లేనప్పుడు ఉద్యోగం మానేసి, ఇష్టం ఐనప్పుడు ఉద్యోగం సంపాదించుకునే తెలివితేటలు ఉండాలి.
4)ఉద్యోగం చేస్తున్నా ఇంటి భాద్యతలు పూర్తిగా నిర్వర్తించాలి.
5)వరకట్నం ఇచ్చే విషయం మీ ఇష్టం కాని వధువుకు వారి తల్లిదండ్రులు ఏమైనా సమర్పించుకోవచ్చు. పెళ్ళి మాత్రం ఘనంగా చేయాలి.
6)వస్త్రధారణ పూర్తిగా మా ఇష్టానుసారంగా ఉండాలి.
7)డిగ్రీలు, ఉద్యోగాలు సంపాదించడమే కాదు వంటా వార్పు కూడా తెలిసుండాలి.
  • ఈ ప్రకటన చాలా మందికి కోపం తెప్పించిఉండవచ్చు. కానీ ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులుకు మాత్రం ఈ ప్రకటన బాగా తెలుసు. స్త్రీ ఎంత చదువుకుని ఉద్యోగం చేస్తున్నా వంటింటి పనులు పూర్తిగా ఆమే చేయాలి. అది ఆమె భాధ్యత. పురుషులు ఎంత చిన్న పని చేసినా అది సహాయమే అవుతుంది కాని భాద్యత కాదు. ఇది నిజంగా నిజం ఎవరైనా కాదంటారా?
  • వరకట్నం వద్దు అనేవారు చాలా అరుదుగా ఉన్నారు. ఒకవేళ వద్దు అన్నా పేరు మారుతుంది కాని లాంచనంగా మాత్రం తీసుకుంటున్నారు.
  • వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేసే మహిళలకి ఆయా ఉద్యోగాల రీత్యా వస్త్రధారణ ఉంటుంది. కానీ అది కూడా ఆక్షేపణల నడుమ నలిగిపోతుంది.

నా ఈ పోస్ట్ చదవుతుంటే ఎంతో మందికి కోపం రావచ్చు. కానీ ఈ పోస్ట్ రాయడానికి ముందు కొన్ని 100ల మంది దగ్గర అభిప్రాయాలను సేకరించాను నేను . వారిలో పెళ్ళి కాని స్త్రీ,పురుషులు ,పెళ్ళి ఐన స్త్రీ, పురుషులు, ఉద్యోగం చేస్తున్న ఆడవారు, ఉద్యోగం చేయని ఆడవారు కూడా ఉన్నరు. కేవలం ఈ పొస్ట్ నా అభిప్రాయ మాలిక కాదు. ఎంతో మంది మనసుపొరలలోని ఆశల రూపం ఈ పోస్ట్.

మినీ కవితలు - 9

>> Friday, February 22, 2008

నిరుద్యోగి

ఉత్తర దక్షిణాలివ్వని

నిరుద్యోగి

ఆశగా తూర్పుని చూస్తే

పడమర పిలుస్తోంది


ఇదెక్కడి న్యాయం

నోరు మూసుకుని అన్నీ భరిస్తే

భారతనారిని దేవతన్నారు

కాదని ఎదిరిస్తే

పిదపకాలం అంటున్నారు.

నా మాటలు - 1

1)ఈ ప్రపంచంలో తెలివైన వారెవరూ పైకి రాలేదు. కష్టపడి శ్రమించిన వారే పైకి వచ్చారు. కాబట్టి మనం కూడా కష్టపడి లేక ఇష్టపడి శ్రమిద్దాం. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుందాం.
2)మనం పిల్లలుగా చేసిన తప్పులు తెలుసుకునే సరికి తల్లిదండ్రులమవుతాం. మరి మనం తల్లిదండ్రులుగా చేసిన తప్పులు తెలుసుకునే సరికి మన పిల్లలు తల్లిదండ్రులవుతారు.
3)మనం కోరే దాన్ని సాధించడం - విజయం
మనకి దక్కిన దానితో తృప్తి పడటం - ఆనందం

గూఢార్దాలు

>> Thursday, February 21, 2008

అన్ని భాషలలో కొన్ని పదాలలో మొదటి అక్షరాన్ని తొలగిస్తే కొత్త పదం తయారవుతుంది. వాటిలో కొన్నింటిని ఇక్కడ పొందుపరుస్తున్నాను. మీకు తెలిసినవి మీరు కూడా నాకు దయచేసి తెల్పండి.
తెలుగు భాషలో:
ధాశరధి - రాముడు
శరధి - అమ్ములపొది
రధి - రధాన్ని ఎక్కినవాడు
ధి - బుద్దిమంతుడు

ఆంగ్ల భాషలో:
1)chair
hair
air

2)price
rice
ice

3)wheat
heat
eat
at
t

తెలుగు పదాలు - 1

తెలుగు భాషలో మొదటి నుండి చదివినా, ఆఖరి నుండి చదివినా ఒకేలా ద్వనించే పదాలు చాలా వున్నాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ పొందుపరుస్తున్నాను. మీకు తెలిసినవి మీరు కూడా నాకు దయచేసి తెల్పండి.
ఆ పదాలు:

జలజ
కునుకు
నటన
కిటికి
పులుపు
కందకం
కలక
నవీన
పంచాస్యచాపం
జంబీరబీజం
లకోలకోల
రంగనగరం
కడనడక
గులాబిలాగు
గాదెనాదెగా
దారివారిదా
తోకమూకతో
పాలునలుపా
పాలుతెలుపా
వికటకవి
మందారదామం
మానవకవనమా
వినమనవి
కడపలోపడక

తెలుగు పదాలు

తెలుగులో ముందు నుండి చదివినా వెనుక నుండి చదివినా ఒకేలా పలికే మాటలు కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్నింటిని సంగ్రహించి వ్రాస్తున్నా. ఇంకా ఎమైనా ఉంటే మీరు జతపరచండి.

ఆ పదాలు:

జలజ

కునుకు

నటన

కిటికి

పులుపు

కందకం

కలక

నవీన

పంచాస్య చాపం

జంబీర బీజం

ల్

మినీ కవితలు - 8

అస్త్రం
నీ ఆలోచన
నీ అస్త్రం
నీ కోపం
నీకు సంధించిన అస్త్రం
జీవితం
జీవితాంతం
జీవికి ఉండేది ఆశ
లేనిది ప్రశాంతత
పెళ్ళి
దివిలో ఆ నిర్ణయం
భువిలో ఈ కళ్యాణం

మినీ కవితలు - 7

మిమిక్రీ

ఎంత

కాపీ కొడితే

అన్ని

మార్కులు


ప్రాచీన భాష హోదా

అక్కా చెల్లెళ్ళు

పక్క పక్కనే

చెల్లికి గుర్తింపు వస్తే గాని

తెలియలేదు అక్కకి-

తనను అందరూ గుర్తించాలని.

మినీ కవితలు - 6

>> Tuesday, February 19, 2008

భర్త
భరించే వాడి నుండి
భాధించే స్డాయి కి
ఎదిగిన వాడు
అమ్మ
బాల్యం లో ధైర్యం
యవ్వనం లో అవసరం
ప్రౌఢం లో తలనొప్పి
ఉమ్మడి కుటుంబం
కలిసుంటే
కలవని మనసులు
విడిపోతే
అతకని బ్రతుకులు

మినీ కవితలు - 5

లోభి
పోయేటప్పుడు
తీసుకెళ్ళేది లేదు
ఉన్నప్పుడు
పంచేది లేదు
పదం
ప్రపంచాన్ని ఓ
కవితలో వ్రాద్దామనుకున్నా
ఓ మాటే
చాలు అన్పించింది
అదే - ప్రపంచం
దశలు
కసి నుండి
కవిత్వం
దాన్నుండి
కపిత్వం.

మినీ కవితలు - 4

అమ్మ

కష్టపడి

http://www.blogger.com/post-edit.g?blogID=4195123470643261502&postID=4934194645470110064చదువు చెప్పించింది

దాని సార్దకతకి

అమ్మనే

వదలి వెళ్ళాల్సి వచ్చింది.


సిరి

బందువు కాకున్నా

వస్తే ఆనందం

పోతే విచారం.

నేటి సినిమా

1
నటనతో కన్నా
వస్త్రాలతో
మెప్పించేది - హీరోయిన్
2
కధ కన్నా
దర్శకుణ్ణి
నమ్మేవాడు - హీరో
3
తను కొత్త వాడైనా
పాత టెక్నీషియన్స్ తో
పని చేయించేవాడు - దర్శకుడు
4
సాహిత్యం కన్నా
మేళ తాళాలనే
వినిపించేవాడు - సంగీత దర్శకుడు
5
కళాత్మకత తగ్గి
ధనాశ ఎక్కువైన వాడు - నిర్మాత
6
అసలైన వాడు
అసలెవరికీ గుర్తు లేనివాడు - రచయిత

ఆట - 2

ఏ మాత్రం తర్కంతో ఆలోచించకుండా ఆడే ఆట ఒకటి ఉంది. ఈ ఆటలో నేను పి.హెచ్ డి చేశాను. ఎంతో మంది దగ్గర ఆడి గెలిచా కూడా. ఆ ఆట ఏమిటంటే ...


మనలో చాలా మందికి అమ్మ,నాన్న ఇద్దరూ ఇష్టమైనా ఎవరో ఒకరు కొంచెం ఎక్కువ ఇష్టం అవుతారుగా. ఆ ఎవరు మనకి ఎక్కువ ఇష్టమో మన చేతి వేలుని బట్టి చెప్పవఛ్హు.


క్రింద ఫొటోలో చూపిన విధంగా బ్రొటన వేలు బాగా క్రిందకు వంగితే అమ్మ అంటే ఎక్కువ ఇష్టమని అర్దం.





మరి వేలు అలా క్రిందకు వంగ లేదంటే నాన్న అంటే ఇష్టం క్రింద ఫొటో లొ చూపిన విధంగా

ఈ రెండింటికి చెందని కొన్ని exceptional cases కొన్ని ఉన్నాయి. అవి మరో ఆట లో.

వరకట్నం

>> Monday, February 18, 2008


DOWRY IS AN ANTI SOCIAL ELEMENT.BUT MANY PERSONS ENCOURAGES DOWRY.
SOME ONE ONLY TRY TO STOP THIS DOWRY SYSTEM.IT IS NOT POSSIBLE IF ALL PEOPLE ARE NOT PARTICIPATE IN THE ANTI DOWRY FORCE.
THERE IS A ONE NEW WEBSITE CAME ABOUT THE ANTI DOWRY SYSTEM.
i.e, http://IDONTWANTDOWRY.COM
IN THIS ADDRESS FIRST BRIDE OR GROOM REGISTER THEIR DETAILS WHO DONT WANT TO TAKE & GIVE DOWRY.WITH OUT REGISTRATION WE MAY WATCH WHO ARE EARLIER REGISTERED PEOPLE.BUT IF WE CANTACT THEM WE MUST REGISTER IN THE WEBSITE.
IT WILL TAKE A GREATE CHANGE WITH IN SOON.

స్వాతంత్ర్య దినోత్సవం

గగనతలాన రివ్వువ్వున ఎగిరే
మువ్వన్నెల ముఛటైన జెంఢానే
భరతమాత చేతిలో ఆయుధమై
భారతీయులకు ఇస్తుంది రక్షణను


కాషాయం త్యాగానికి గుర్తుగా
శ్వేతం శాంతికి చిహ్నంగా
హరితం పాడిపంటలకు నిదర్శనంగా
ధర్మచక్రం ధర్మానికి ప్రతిబింబంగా
రూపకల్పన చెసిన పింగళి
స్వాతంత్ర్య దినోత్సవాన
అందుకోవయ్య మా వందనాలు


అందరికీ అమ్మవైన ఓ భరతమాత
కాశ్మీరే నీకు తలమానికం
హస్తినయే నీ హ్రుదయం
భరతదేశమే నీ అవయవ సౌష్టవం
నీవే మాకు దేవతా విగ్రహంఅందుకోవమ్మా
నీవు ఈ ప్రణామంస్వీకరించవమ్మా ఈ కవితభివందనం.

FAREWELL PARTY

కదిలిపోయే కాలం మద్య
వీడలేని బందాన్ని ఏర్పరచుకొని
వీడ్కోలు చెబుతూ
వెళ్ళిపొతున్నవా నేస్తం

ప్రతి కలయిక వీడ్కోలుకు నాంది
అంటూమరోసారి కలవాలంటే
నేడు విడిపోక తప్పదంటూ
హ్రుదయాంతరాలలొ
స్నేహ హస్తాన్నిపదిలంగా దాచుకుంటూ
నాతొ కరచాలనం చేస్తూ
మమ్ములను వీడి వెళ్ళిపోతున్నావా నేస్తం


మొక్క అనే అభిమానంలొ
నీరు అనే అనే ప్రేమను పొసి
పూవు అనే మమకారం పెంచుకొని
చెట్టు అనే స్నేహబందాన్ని ఏర్పరచుకొని
ఇప్పుడు వెళ్ళిపొతున్నవా నేస్తం

తిరిగిరానివి ఈ కాలేజీ రోజులు
మరచిపొలేనివి ఈ కాలేజీ రోజులు
అటువంటి ఈ కాలేజీ జీవితాన్ని ముగించి
కొందరు ఉద్యోగాల వేటలొ
మరికొందరు ఉన్నత చదువుల ఉబలాటంలో
ముందుకు సాగుతూ
రాబోయే కాలంలొ ఒడిదొడుకులను తట్టుకొంటూ

పాతజ్ఞాపకాల నీలినీడలలొ
కష్ట సమయంలొ కూడా
చిరునవ్వులు చిందిస్తూ
నలుగురినీ నవ్విస్తూ
నవ్వులపాలు కాకుండా
వందమందిలొ ఒక్కరివి కాకుండా
వందమందిలొ ఒక్కరిగా ఉంటూ
భారతావనికి నీవంతు సేవ చేస్తూ
దేశభివ్రుద్దిలో నీవు పాలు పంచుకొవాలని ఆశిస్తూ...

STRUGGLES FACED BY BHARATHMAATA

FOR 100 YEARS OF STRUGGLE WE GOT INDEPENDENCE.
BUT WITHIN SHORT SPAN OF TIME WE ARE NEGLECTING THAT INDEPENDENCE.
THIS AUGUST 15th IS NOT ONLY INDEPENDENCE DAY IT IS ALSO NEGLECTING DAY
BECAUSE SO MANY PERSONS THINK IT IS ONLY A HOLIDAY.JUST EVEN THEY DONT SALUTE TO FLAG.
I DONT KNOW WHY AUG 15th DECLARED AS HOLIDAY?
JUST THINK IN OUR INDEPENDENCE DAY WE DONT DO OUR REGULAR WORK.GOVT. HAD LOST 59 WORKING DAYS TILL NOW.
IS BHARATHA MATHA BECOME HAPPY TO STOP OUR REGULA(OFFICE) WORK IN INDEPENDENCE DAY?
IN MY POINT POINT OF VIEW THERE IS NO NEED TO GIVE HOLIDAY FOR AUG15th.

పెళ్ళంటే

ఒక శుభముహూర్తాన
రెండు మనసుల కలయికతో
మూడు ముళ్ళు వేసి
నలుగురి దీవెనలతో
పంచ భూతాలు సాక్ష్యులుగా
అరుంధతి నక్షత్రాన్ని చూసి
ఏడడుగులు వేసి
అష్ట కష్టాలను వోర్చి
నవ వసంతంలా ప్రతీరొజూ
పది లంగా గడపడమే
పెళ్ళంటే

TODAY LIFE


+ HEAD ACHE
- MONEY
* PROBLEMS
% LOYALTY
= NOPEACE
& NO WATER TO DRAWN U R SELF


MEANING:
NOW A DAYS OUR LIFE STARTS WITH HEAD ACHE ,WE LOSS MONEY,PROBLES ARE ALSO ADDS TO THAT ,WE MISSED LOYALTY IN PEOPLE THEN THERE IS NO PEACE IN OUR LIFE. AT LAST WE DON'T HAVE WATER TO DRAWN OUR SELF.

మినీ కవితలు - ౩

>> Sunday, February 17, 2008

ఏకాకి
’నా’ వాళ్ళని
వదిలేస్తే గాని
విజయం
వరించలెదు నన్ను
మనం
కళ్ళు మూస్తే ఋషి
మాట్లాడితే యోగి
మౌనం వహిస్తే జ్నాని
నవ్వితే భోగి
ఇవన్నీ ఉంతే మహర్షి
ఏవీ లేకుంటే మనిషి
మగవాడి ఆలోచన
భయపడితే
అణుకువ
ఎదిరిస్తే
బరితెగింపు
అన్నదే స్త్రీ తత్వం

మహాదానం (కవిత)

చేస్తేను రక్తదానం
నిలిచేను మరొకరి ప్రాణం
అయ్యేను అనారోగ్యం దూరం
మరి ఇక మన చెంతే ఆరోగ్యం
అదే కదా మన భాగ్యం
రక్త దానం కానేకాదు కాష్టం
అందుకు మనకు రాదు ఏ నష్టం
వయోభేదమే అభ్యంతరం
వయోజనులే ఇందుకు అర్హం
మహిలో చేస్తే దానం
సురలోకంలో సౌఖ్యం
కానీ ఇలలో చేసే రక్తదానం
ఇచ్హును జీవితాంతం ఆరోగ్యం
అది కదా మనకు ఆనందం
అందుకే . . .
రక్తదానం మహాదానం.

GENERAL KNOWLEDGE - 2

1)first Indian Air chief - AIRMARSHAL S.MUKHERJEE
2)first chief of Army staff - GENERAL M. RAJENDRA SINGH
3)first chief of naval staff - VICE ADMIRAL RD KATARI
4)first commander-in-chief of free India - GENERAL SIR ROY BUCHER
5)first Indian commander-in-chief of free India - GENERAL KM CARIAPPA
6)first field marshal - SHFJ MANEKSHAW
7)first chief justice of India - HARILAL J KANIA
8)first Indian ICS officer - SATYENDRA NATH TAGORE
9)first Indian woman IAS officer - ANNA GEORGE MALHOTRA
10)first Indian woman IPS officer - KIRAN BEDI

ఆక్యుపంచర్

ఆక్యుపంచర్ భారతీయ ప్రాచీన వైద్య విధానం. చిన్న చిన్న విధానాలను అనుసరించి మనం ఆరోగ్యంగా ఉండవచ్హు.అందులో ఒక వైద్య విధానం...

పై ఫొటోలో చూపించినట్టు రోజూ 5-10 సార్లు అరచేయి మధ్యలో నొక్కడం వలన మూత్రపిండాల సమస్య నుండి బయటపడవచ్హు.

మూత్రపిండాల సమస్య లేనివారు కూడా ఈవిధంగా చేయవచ్హు.

కాని మరీ ఎక్కువగా చేయడం కూడా సమస్యే.

ప్రయత్నించి లాభించండి

సర్వేజనాః సుఖినోభవంతు.

ఆట

సైన్స్ కి అందని విషయాలు ఎన్నో ఉన్నయి ఈ ప్రపంచంలో అందులో ఒక విషయం ఈ క్రింది విషయం. అది ఏమిటంటే
మొదట సీతరాములులో ఎవరో ఒకరిని కోరుకోండి. తప్పనిసరిగా ఎవరోఒకరిని కోరుకోవాలి. ఆ తర్వాత ఫొటోలో చూపిన విధంగా చేయండి. నొక్కి పట్తిన భాగం ఎర్రగా మారితే మీరు సీతను కోరుకున్నట్టు. లేకుంటే రాముడుని కోరుకున్నట్టు.
ఎవరి మీద వారు ప్రయొగించడం కన్నా మరొకరి మీద ప్రయొగించడం సుళువు.
నేను దాదాపు 1000 మందికి ప్రయత్నించి చూసా 995 మందికి సరిగా సమాధానం ఇచ్హా.
మీరు ప్రయత్నించండి.

కన్నుల భాష

ఒకో సారి నోటి మాటతో మన మనసులో భావాన్ని చెప్పలేం. అటువంటప్పుడు కళ్ళతో మాట్లాడతాం మనం మనకి తెలియకుండానే. అటువంటి కొన్ని భావాలు క్రిందన ఉదహరించినాను.

1)


ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కళ్ళు ఎడమ వైపు పైకి చూస్తే వారు జరిగిన విషయాన్ని గుర్తుకు తెచ్హుకుంటున్నారని అర్దం. పై ఫొటోలో వివరించినట్టు.

2)


ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కళ్ళు కుడి వైపు పైకి చూస్తే వారు అబద్దం చెప్పడానికి సిద్దం అవుతున్నారని అర్దం. పై ఫొటోలో వివరించినట్టు.

ప్రేమ

>> Friday, February 15, 2008

ప్రేమకు ఉండేది జననం
ప్రేమకు లేనిది మరణం
ప్రేమకు ఉండవలసింది నమ్మకం
ప్రేమించెటప్పుడు కనిపించనిది లోకం
ఇదే ప్రేమైక జీవనం
అన్నదే ప్రేమికుల సిద్దాంతం.

ప్రేమలేఖ


"ప్రియా ఓ ప్రియా"
"నువ్వే నువ్వే" నా "మనసంతా నువ్వే" అని "నీతో" నా "మనసులో మాట" "చెప్పాలని వుంది". నిన్ను "కలుసుకోవాలని" నువ్వు "హలో I LOVE YOU" అంటే "వినాలని వుంది". "అంతపురం" లో ఉండే "నీ ప్రేమకై" "వేచివుంటా". "ప్రేమంటే" ఏమిటో చెప్పి ఈ "చంటబ్బాయి"ని "గడుగ్గాయి"లా మర్చావు. "ప్రేమికుల రోజు" "నువ్వు నేను" కలిసి "హైదరాబాదు"లో "ఫిల్మ్ సిటి"ని "చూడాలని వుంది".

"నీ ప్రేమకై"

xxx

REPLY LETTER

"ప్రియమైన నీకు"

మన "ప్రేమ"కు "ఆస్తులు - అంతస్తు" "కులగోత్రా" ప్రమేయం లేదు. "మల్లెపూవు" కన్నా తెల్లనైన "నీ మనసు నాకు తెలుసు". "నువ్వు నాకు నచావు" "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" "నిన్నే పెళ్ళాడతా" అని అంటే మా "శాంతి నివాసం"లో అందరూ మన పెళ్ళి కి అంగీకరించారు. "ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్" లో "నీ కోసం" "రోజా పూలు"తో "వేచివుంటా". "ప్రేమతో రా".

"ప్రేమతో"

yyy




మంచి రోజు

ఏ పని మొదలు పెట్టాలన్నా మంచి రోజు కోసం వేచి చూసే వేద భూమి మన భ్హారత దేశం. ఒకనాటి ఈ నమ్మకం నేడు మూడనమ్మకంగా పరిణతి చెన్ది మనిశిలో బద్దకం పెరగదానికి కారణం అవుతుంది. కాని సంకల్పబలమే అద్బుతశక్థిగా, krushi e సాధనంగా, పట్టుదలే పెట్టుబదిగా ఏ కార్యం ఎప్పుడు మొదలుపెట్టినా విజయం మనకి స్వంతం అవుతుంది. మనకి వున్న తిదులలో, ప్రతి తిది ముఖ్యమనదే మంచిదే.
వాటికి ఉదాహరణలు:
పాడ్యమి - ఉగాది
విదియ - చంద్ర దర్శనం
తదియ - అట్ల తదియ
చవితి - వినాయక చవితి
పంచమి - నాగ పంచమి
shashti - సుబ్రమణ్య shashti
సప్థమి - రధ సప్థమి
ashtami - krishnashtami
నవమి - శ్రీరామ నవమి
దశమి - విజయ దశమి
ఏకాదశి - వైకుంఠ ఏకాదశి
ద్వాదశి - kheeraabdi dwaadasi
త్రయొదశి - శని త్రయొదశి
చతుర్దశి - శివరాత్రి
పౌర్ణమి - rakshaa bandanam
అమావాస్య - దీపావళి

General Knowledge-1

1)First Chinese pilgrim to visit India - FATHIEN(401-410)
2)First American president to visit India - DWIGHT DAVID(1950)
3)First British Prime Minister - HAROLD MACMILLAN
4)First Foreign invader of India - ALEXANDER THE GREATE,326BC
5)First Muslim woman to sit on the thron of Delhi - RAZIA SULTHANA
6)First European to visit India - VASCO DA GAMA(1498)
7)First viceroy of India - LORD CANNING
8)First British Governor General of Independent India - LORD MOUNTBATTEN
9)First Indian Governor General of India - C.RAJAGOPALACHARI
10)First Chief of Air staff - AIR MARSHALL SIR THOMAS ELMHIRST

అందం

>> Saturday, February 9, 2008


ఆకాశం నీడలో
పచ్హని చీర కట్టి
భూమాత నిదురోతుంటే
పొగమంచు దుప్పటైన వేళ
అరుణోదయం...
చూసే కన్నులదెంత భాగ్యం
ఇది పల్లెలకే లభించిన వరం
మెట్రోపాలిటన్ లందు మ్రుగ్యం ఈ ద్రుశ్యం
ప్రపంచీకరణతో వచిన ఈ శాపం
సాధ్యం కాదు ఎవరికీ దీన్ని తీర్చడం.

కవిత

ఓ స్త్రీ నీ సన్కెళ్ళు తెన్చుకో
మహిళా.. ఓ మహిళా...
ఇస్తున్నారా నీకు విలువ
వేస్తున్నారు నీకు శిలువ
యుగాలు మారినా
మారని బ్రతుకులకు
నిలువెత్తు నిదర్శనమ్ ఆడది
భయమ్ తో తల ఒగ్గితే అణుకువ
సహనమ్ చచ్హి ఎదిరిస్తే బరితెగిమ్పు
ఇవే మగవాడు తెలుసుకున్న సూత్రాలు
సాగరమ్ కన్న లొతైన ఆడదాని మనసును
ఏ మనసున్న మగవాడైన అర్దమ్ చేసుకోగలడా?
ఆత్మ విశ్వాసాన్ని అహమ్కారమ్గా మలచి
స్త్రీని అణచేస్తున్నఈ ధూర్థ లోకమ్ తీరు
మారే సమయమ్ ఆసన్నమైన్ది
అన్దుకు నిదర్సనమే
మధ్య తరగతి అమ్మాయిల చదువులు.

మిని కవితలు-2

కన్నీళ్ళు
కళ్ళలో కుళ్ళుని
గున్డె బరువుని
మాయం చెసెవె -కన్నీళ్ళు
నేను
నిరాశ లో
ఆశని
వెతుక్కున్టున్నా

మినీ కవితలు-1

జీవితం
వచ్హే దంతా పొయేదే
మనశ్శాంతి తొ సహా

Back to TOP