వినాయక చవితి.... నా చిన్నప్పుడు
>> Friday, September 10, 2010
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు...
వినాయక చవితి అంటే.. చిన్నప్పుడు భలే సరదా... భయం రెండూ ఉండేవి..
సరదా ఎందుకంటే.. చాలా రకాల ప్రసాదాలు తినేయవచ్చు. స్కూలు కి శెలవు వస్తుంది. ఇక భయమెందుకంటే.. పూజ సరిగ్గా చేయకపోతే.. దేవుడికి కోపమొచ్చేస్తుందంట !!! అసలే వినాయకుడు.. అతనికి కోపమొస్తే... ఇంక అంతే సంగతులు.. చదువుకు మధ్య లోనే విఘ్నం వచ్చేస్తుందంట.. ఎన్ని చెప్పేవారో ఈ పెద్దోళ్లు...
వినాయక చవితి పూజ కి మా ఇంట్లో పుస్తకాలకి కూడా పూజ చేసేవాళ్లం.. ఇక నా కన్ఫ్యుజన్ చూడాలి... మొత్తం మేటర్ వున్న టెక్స్త్ బుక్స్ పెట్టాలా లేదా చక్కగా జవాబులు ఇచ్చే గైడ్ పెట్టాలా లేక సెకండ్ హాండ్ షాప్ లో సంవత్సరం మొదటిలోనే కొనేసిన ఆల్ ఇన్ వన్ (ఈ పుస్తకం నా దగ్గర ఉన్నట్టు మా స్నేహితులకి తెలీదన్నమాట నిజానికి వాళ్ల దగ్గర అప్పటికే ఉన్న విషయం నాకూ తెలియదు ) పెట్టాలా లేదా ముందు సంవత్సరం పరీక్షలకి ఇచ్చిన ప్రశ్నా పత్రాన్ని వ్రాసుకున్న పుస్తకం పెట్టాలా?? ఇన్ని సందేహాల మధ్య నేనుంటే... మా అమ్మ ఏమో.. ఇక్కడ వంటింట్లో ఇంత పని ఉంటే అక్కడ ఒక నాలుగు పుస్తకాలు తీయడానికి ఎంత సేపు అని కాస్తంత అతి ప్రేమతో పిలుపు... పోనీ ఆ వంటిట్లోకి వెళ్లి ఏదో చేసేద్దాం అనుకుంటే... ఆ ఆకు ఇలా మడత పెట్టాలి.. ఆ కజ్జి కాయలో ఇంతే కొబ్బరి పెట్టాలి.. అని ఆర్డర్స్.. పూజ అయినంత వరకూ ఏమీ తినకూడదని ..మా అమ్మ ముందు రోజు ఒక వంద సార్లు చెప్పేది .. అందుకే ఆ రోజు మరీ ఆకలి వేసేది.. అమ్మా.. ఆకలి వేస్తుంది.. త్వరగా పూజ చేసేయొచ్చు కదా... అంటే... నా వర్క్ షిఫ్ట్ వంటింటి నుండి గుమ్మాల దగ్గరకి మారేది.. గుమ్మాలకి పసుపు రాసి.. తోరణాలు కట్టాలి.. పసుపు రాయాలంటే.. కిందకి వంగి చేయాలి.. మనకి నడుం వంగదు.. తోరణాలు కట్టాలంటే... నేనెమైనా స్వయంవరం సినిమాలో వేణు నా?? ఎక్కడో అల వైకుంటపురంలో వున్న గుమ్మం టాప్ కి శ్రమ కోర్చి తోరణం కడితే..ఆకులు మంచివి చూసి ముడి వేయవా... అని మళ్లీ మా అమ్మ.... మొదలుపెడుతుంది... ఇలా... కష్టపడి ఎట్టకేలకు పూజ కి కూర్చున్న తర్వాత... మనం తెలుగు మీడియం కాబట్టి ..పూజా విధానం భాద్యతలు నాకే వచ్చేవి.. నేను సూపర్ ఫాస్ట్ గా చదివేస్తూ ఉంటే... మా అమ్మ ఎర్ర జండా పట్టుకుని ఊపుతూ ఉంటుంది... మొత్తానికి పూజ కానించి మద్యాహ్నానికల్లా... బ్రేక్ ఫాస్ట్ చేసే వాళ్లం. సాయత్రం బోల్డన్ని గుళ్ల కెళ్లి ఎన్నో గుంజీళ్లు తీసే వాళ్లం.. అలా దేవుడికి ఇష్టం అంట.. చీకటి పడకుండానే ఇంటికి వచ్చి .. మళ్లీ పూజ చేసేసి.. రాత్రికి పళ్లు తినేసి నిద్రపోయేవాళ్లం. హోం వర్క్ చేయాల్సిన పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసేసే దాన్ని.. చక్కగా హోంవర్క్ చేయవలసిన అవసరం ఉండేది కాదు :-) ఆ తర్వాత రోజు స్కూల్లో వీపు విమానం మోతే మరి... :-(
ఇలా భలే సరదాగా ఉండేది.. వినయక చవితి అంటే.. అప్పుడు అమ్మ పనులు చేయమని చెప్పినప్పుడు.. ఏదో లా అనిపించినా.. ఇప్పుడు ఉద్యోగం కోసం ఊరు మారాక... ఇంటి విలువ.. ఇంకా చాలా చాలా తెలిశాయి... :-( :-)
అందరికీ మరొక్క సారి వినాయక చవితి శుభాకాంక్షలు.
7 comments:
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు!
వినాయక చవితి శుభాకాంక్షలు.
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు
haaaaaaaaaaaaa haaaaaa haaaaaaa
:-))))))
bagundi mee bhyam,bhakthi
వినాయక చవితి శుభాకాంక్షలు.
మీకు, మీ కుటుంబానికి
వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు
SRRao
శిరాకదంబం
హమ్మయ్య.. డిటో డిటో ఇక్కడ. ;-) ఈ రోజు పొద్దుట పూజ చేసుకుంటూ అప్పుడె ఐపోయింది పూజ అనుకుని ఆనక నవ్వుకున్నా, చిన్నప్పుడూ ఈ పాటి దానికి ఎంత తతంగం చేసే వాళ్ళము రా సామి అని.
వినాయకచవితి శుభాకాంక్షలు.
Murali mohan Gaaru, Vijaya mohan Gaaru, Siva prasad gaaru, Saavirahe gaaru, Rao Gaaru, Bhaavana Gaaru...Dhanyavaadamulu :-)
Post a Comment