నేను మొబైల్ కొన్న కొత్తలో....

>> Sunday, September 12, 2010

అందరి లానే నాకు మొబైల్ అంటే ఇష్టం ఉండేది మొదట్లో... కానీ భయం ఎక్కువ... ఎందుకంటే.. దాని ఆపరేషన్ రాదు మరి నాకు... ఎట్టకేలకి కొన్ని తప్పనిసరి పరిస్తితులలో మొబైల్ కొన్నాను... మామూలు మొబైల్ కాదు...కె...మె...రా... మొబైల్... చిన్నప్పటి నుండి కెమెరాను కూడా చూడని మొహమేమో నాది... నా మొబైల్ అంటే...నాకు ....భలే ఇష్టం ఉండేది... రోజుకి తక్కువలో తక్కువ ఒక పాతిక వరకూ ఫొటోస్ ని తీసేదాన్ని.. అలా మొబైల్ కొన్న కొత్తలో.. ఒకసారి ఒక బుక్ షాప్ కి వెళ్తే " మాయా బజార్ " సినిమా పుస్తకం కనిపించింది. ఇంట్లో కొనమంటే... కొనరు కదా ( ఈ పెద్దోళ్లు ఉన్నారే...) ఆ పుస్తకానికి అట్ట అదిరిపొయింది. నట దిగ్గజాలు ఉన్నారు మరి ఆ అట్ట మీద... మన దగ్గర మొబైల్ ఉంది కదా.... పండగ చేసుకున్నా.. ఫొటోస్ తీసి... అవే ఇవి...

ఆ సినిమాలో సావిత్రి ని మించిన హీరో ఎవరు చెప్పండి??
ప్రతీ సినిమాలో N.T.R. కి S.V.R. తండ్రి గానో బాబాయి గానో నటిస్తారు.. కానీ ఈ సినిమాలో మాత్రం N.T.R. నటించారు S.V.R. మామయ్యలా.. బహుశా.. ఇలా ఈ ఒక్క చిత్రంలోనే నేమో...

3 comments:

అశోక్ పాపాయి September 13, 2010 at 9:58 AM  

meeru teeeeeeeesina sitralu bagunaiandi

Ramakrishna Reddy Kotla September 15, 2010 at 5:15 AM  

మొత్తానికి బాగానే వచ్చాయి ఫోటోలు మీ మొబైల్ కెమేరాతో...ఇంతకీ ఏం మొబైల్ అది...ఏ మోడల్? (please remove word verification)

జాహ్నవి ని September 15, 2010 at 10:10 AM  

Ashok Gaaru, Thank U.

Rama Krishna Gaaru, Thanks andi. Sony K510i.

will remove that. :-)

Back to TOP