ఎలా ? ఎలా ?
>> Friday, April 11, 2008
ఏమని వర్ణించను
నా చెలి అందాన్ని
అంతకు మించిన
అందమైన ఆమె మనసును
ఏమని వర్ణించను
పూవు కన్నా సున్నితమైన
ఆమె మనసును పూవుతో సరిపోల్చగలనా!
నెమలికే నాట్యాన్ని నేర్పగల
ఆమె మేను హొయలను
నెమలితో సరిపోల్చగలనా !
కోయిలకే పాటలు నేర్పించగల
ఆమె గానామృతాన్ని
కోయిలతో సరిపోల్చగలనా !
కరుడు కట్టిన హృదయాన్ని సైతం కరిగించగల
ఆమె కరుణగల చూపును
ఏ అమృతమూర్తితోన్నైనా సరిపోల్చగలనా !
శత్రువుని సైతం
సాదరంగా ఆహ్వానించే
ఆమె మనసుకు సాటి గలదా!
వర్ణించలేను ఆమెను ఈ చిరుకవితలో
మరి మాట్లాడలేను ఎదురుగా ఆమెతో
నా కవితకు ప్రాణం ఆమె
నా కవితకు రూపం ఆమె
అందుకే అంకితం ఈ కవిత ఆమెకే ....
7 comments:
Chala baga rasarandi
rasinavariki entha andamaina manasundo........
adhbhuthamaina varnana
im jahnavi```
i do stay in hyderabad
d abv comment was posted by me
నాని గారు ధన్యవాదములు
anonumous జాహ్నవి గారు ధన్యవాదములు నాకు చాలా ఆనందంగా వుంది. నా పేరుతో వున్న మరొకరు నా కవిత చదివినందుకు
మీ కవితలు చదివాను.చాలా బావున్నాయి. మీ కవితా స్ప్రూర్తికి దన్యవాదాలు. నా బ్లాగులోని బొమ్మలకు కవితారూపం ఇవ్వగలరిని చిన్న ఆకాంక్ష.
www.pruthviart.blogspot.com
మీరు అమ్మాయి అయ్యి చెలిని వర్ణించడమేంటండి...ప్రేమించడమేంటండి...
ఏదో అబ్బాయి రాసినట్టు....
ఐనా భావం ఉంది కాని కవితలో కొత్తదనం లేదు...
ఎ కవిథని మి నాన్న ధైర్యం అనే శీర్షికలో ఉన్న భావం 100 రెట్లు బాగు...
ఆ ఫీలింగ్ ని కవిథగా మలచండి...
చుద్దాం...!!!
Post a Comment