మన కాశ్మీరం
>> Thursday, April 3, 2008
అందమైన కాశ్మీరం
భారతావనికే తలమానికం
తెల్లని మంచుతో
పచ్చని చినార్ చెట్లతో
నిత్యం ప్రవహించే జీలం నదితో
అలరారే కాశ్మీరం
నేడు మరి ఉగ్రవాదులకు నిలయమై
మత దురహంకారులకు నెలవై
అమాయకుల మరణానికి సాక్షియై
మౌనంగా రోదిస్తోంది.
వెండి కొండల సోయగాలు
ప్రజల మూర్ఖ్హత్వానికి బలి అవుతుంటే
పచ్చని చినార్ చెట్లు
మోడులా మిగిలిపోతుంటే
నిత్యం ప్రవహించే (జీలం నది) జీవ నది
జీవం కోల్పోతుంటే
చివరికి ఆ అందమైన కాశ్మీర
అంగాంగం మత పిచ్చికి మండి
కరిగి రుధిరపుటేరులై ప్రవహిస్తుంటే
ప్రకృతి అందానికి ప్రతిరూపమైన ఆ కాశ్మీరం
నేడు దారుణ మారణకాండకు ప్రతిరూపం
ఇక దీనికి పలకాలి అంతం
అప్పుడు అవుతుంది భారతదేశం అండరికీ మార్గదర్శకం
అందుకు మనం చేయి-చేయి కలుపుదాం
ఉగ్రవాదులను తరిమి కొడదాం
మతదురహంకారాన్ని నాశనం చేద్దాం
అదే కదా భరతమాత అభిమతం
భారతమాతాకి జై
1 comments:
"ప్రకృతి అండాన్నికి"
అహా అందానికి మొదటి మెట్టు అండమే అని చెప్పారు కవయిత్రిగారు. బహొత్ కూబ్
Post a Comment