నిరీక్షణ
>> Tuesday, April 1, 2008
ప్రియతమా...
ఆవేదన, ఆక్రోశం నన్ను ఆక్రమిస్తుంటే
ఉత్సాహం, ఉత్తేజం ఆవిరైపోయి
జీవచ్చవంలా ఉన్న నాకు
నా కన్నీరే గోదారై
నా దాహార్తిని తీర్చేవేళ
ఎదురుచూశాను నీ కోసం
నిశీధిలో సైతం వెతికాయి
నా కనులు నీకోసం
నీ అమృతహస్తం నాకై అందిస్తావని,
నా హృదయారాధ్యదైవానివైన నీవు
నీ అర్దాంగిగా చేసుకుంటావనే
ఆశతోనే ఈ నిరీక్షణ.
5 comments:
అబ్బా ఎంత బాగుందో.
మిమ్మల్ని ఆక్రమించుకున్న ఆవేదన ఆక్రోశం
త్వరలోనే విడిచేయాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
అలానే ఆవిరైపోయిన
మీ ఉత్సాహం ఉత్తేజం
మళ్ళీ నీరై మీ చేత తాగింపబడి
మరెన్నో కవితలు వ్రాసేందుకు
దోహదపడాలని కూడా
మనవి చేస్తుకుంటున్నా.
మీ హృదయారాధ్య దైవం
మిమ్మల్ని అర్ధాంగిగా చేసుకోవాలని
ఆ భగవంతుడిని కోరుకుంటాను.
ఆ ఆనందభాష్పాలు
మీ దాహార్తిని తీరుస్తూ
ఉరకలెత్తి ప్రవహించే
గోదారిలా పొంగాలని
కోరుకుంటూ మనవి చేస్తుకుంటున్నా.
అభ్యాగతుడు గారు ధన్యవాదములు.
ఆశతోనే ఈ నిరీక్షణ
నీ అర్దాంగిగా చేసుకుంటావనే
నా హృదయారాధ్యదైవానివైన నీవు
నీ అమృతహస్తం నాకై అందిస్తావని,
నా కనులు నీకోసం
నిశీధిలో సైతం వెతికాయి
ఎదురుచూశాను నీ కోసం
నా దాహార్తిని తీర్చేవేళ
నా కన్నీరే గోదారై
జీవచ్చవంలా ఉన్న నాకు
ఉత్సాహం, ఉత్తేజం ఆవిరైపోయి
ఆవేదన, ఆక్రోశం నన్ను ఆక్రమిస్తుంటే
ప్రియతమా...
తల్లక్రిందులు చేసి చదివినా అద్భుతంగానే వుంది....
అభి.భి గారు మీ ప్రయోగం బాగుంది. ధన్యవాదములు
ఎదురుచూడటం మాని, ఎదురీదడం మొదలుపెట్టండి.
ఈ సభ్యసమాజంలో... మనసుకి, మమతకి చోటులేదేమో!
2 సం|| లేటుగా రాస్తున్నట్లున్నాను....
మీకు అంతా మంచేజరిగివుటుందని ఆశిస్తూ! :)
Post a Comment