శ్రమ యేవ జయతే

హారం పత్రిక సంక్రాంతి పోటీలో మొదటి బహుమతి పోందిన నా కవిత

>> Tuesday, January 10, 2012

హారం పత్రిక వారు నిర్వహించిన సంక్రాంతి పోటీలో ఒక విభాగంలో నా కవితకు మొదటి బహుమతి వచ్చిందోచ్. హారం వారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.ఈ సారి సంక్రాంతికి ఇంటికి వెళ్లడానికి శెలవు దొరకలేదని భాధపడుతుంటే...నాకు సంక్రాంతి ఈ బహుమతి రూపంలో రెండురోజుల ముందే వచ్చేసిందోచ్... ఆనందమానందమాయే... :-)

హారం పత్రికను ఇక్కడ, బహుమతి పొందిన నా కవితను ఇక్కడ చూడవచ్చు.
అందరికీ ముందుగానే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.



నేస్తం

మది దాటని మాటలన్నీ
మూటగా కట్టి
మనసెరిగిన నేస్తానికి
చిరుకానుకగా అందించాలని

ఊసులన్నీ గుట్టగా పోసి
బాల్య స్మృతులతో కలగలిపి
నీ కోసం వేచిఉంటే

జ్ఞాపకాల నీలి నీడలను నాకు వదలి
ప్రేమతో పెనవేసిన బంధాన్ని మర్చిపోయి
అందుకోలేని తీరాలకు....
అందరినీ వదిలేసి
నన్నొంటరిని చేసి
వీడ్కోలు పలికావా నేస్తం !!!

ఎన్నటికీ రాలేని నీ కోసం
నీ జ్ఞాపకాలు మరువని నేస్తం...

10 comments:

raf raafsun January 11, 2012 12:05 AM  

congratulations..... i m the fish wisher...

Dsr Murthy January 11, 2012 9:52 AM  

My hearty congratulations on this......

Dsr Murthy January 11, 2012 9:59 AM  

My hearty congratulations ...........

జ్యోతిర్మయి January 12, 2012 5:01 AM  

జాహ్నవిగారూ అభినందనలండీ...

కాయల నాగేంద్ర January 12, 2012 6:19 AM  

హారం పత్రికవారు నిర్వహించిన సంక్రాంతి పోటీల్లో మీ కవితకు ప్రధమ బహుమతి వచ్చినందుకు మా అభినందనలు. మీ కవిత 'నేస్తం' చాలా బాగుంది. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు!

జయ January 12, 2012 8:14 AM  

'కవి కాలం మరిచినా
కోకిల గానం మరిచినా
నెమలి నాట్యం మరిచినా
నీవు నన్ను మరిచినా
నేను నిన్ను మరువను మిత్రమా!'అనిపించారు...స్నేహం ఎంత కఠినమైనదో మీ మనసుతో పలికారు. మీకు నా హృదయ పూర్వక అభినందనలు.

జాహ్నవి January 12, 2012 9:04 PM  

Raf raafsun gaaru, DSR Murthy gaaru, Thank you very much

జాహ్నవి January 12, 2012 9:07 PM  

జ్యోతి గారు, ధన్యవాదములు.
నాగేంద్ర గారు, ధన్యవాదములు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
జయ గారు, ధన్యవాదములు. పాతవి కూడా చూశారా?? చాలా థాంక్స్..

Chandni January 13, 2012 7:08 AM  

Hey congrats dear.....I look forward if you also write in English.

My best wishes are with u.

bhadrachari January 19, 2012 9:57 AM  

teluguloni snehanni tiyaga cheppinaniku na danyavadalu

Back to TOP