పగలు, రాత్రి సమానంగా ఉండే రోజు మళ్లీ వచ్చేసింది...

>> Thursday, September 22, 2011

అవునండీ.. సంవత్సరంలో పగలు,రాత్రి సమానంగా ఉండే రోజు ఈ ఒక్కరోజే. అందుకే ఈరొజు నుండే సూర్యమానం ప్రకారం తులా రాశి మొదలు అవుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అని అనుకుంటున్నారా? మరి ఈ రోజే కదా నేను పుట్టింది. అందుకే ఈ రోజు గురించి ఇంత పరిశోధన.

చిన్నప్పటి నుండి పుట్టిన రోజు అంటే అందరిలానే నాకు కూడా చాలా ఇష్టం. క్లాసులో పుస్తకాల బరువు పెరుగుతున్న కొద్దీ పుట్టిన రోజు మీద ఆసక్తి తగ్గుతూ వచ్చింది. కానీ ఒక కల మాత్రం మిగిలిపోయింది. ఇంక అది తీరదు అని తెలిసిపోయింది అందుకే నా బ్లాగులో వ్రాసేసుకుంటున్నాను. అదేమితంటె.. అర్దరాత్రి సరిగ్గా పన్నెండు గంటలు దాటగానే నాకు బోల్డన్ని ఫోన్ కాల్స్ వచ్చేయాలని, చాల మంది నాకు విషెస్ చెప్పేయాలని కోరిక.. ఒకసారో, రెండు సార్లో అలా జరిగింది. అది కూడా బోల్డన్ని కాదు ఒకటో, రెండో... ఇంక ఈ ఉద్యోగాలలోకి వచ్చాక... పుట్టిన రోజు విషయమే గుర్తు ఉండటం లేదు.. మొత్తానికి చదువుకునేటప్పుడు ఉండే పట్టుదల, ఓపిక, ధైర్యం, ఆశావాహ దృక్పధం అన్నీ ప్రస్తుతం కొరవడ్డాయి నాలో. జీవితమంతా చప్పగా, చేదుగా ఏదోలా ఉంది. కొత్త విషయాలు నేర్చుకోలేనందుకు చప్పగా... ఎంత కష్టపడినా అనుకున్న వాటిలో సగభాగం కూడా సాధించలేనందుకు చేదుగా అనిపిస్తుంది ఈ జీవితం.
ఎప్పుడు ఎలా ఉన్నా.. తీపి మీది మక్కువతో ఉదయించే సూర్యుని చూస్తూ.. ప్రతీ రొజూ ఆశతో ఆశయసిద్ది కోసం ప్రయత్నించడం అలవాటయిపోయింది. ప్రస్తుతానికి నా మనసు, నా ఆలోచనలు కూడా.. ఈ పోస్టు లానే అస్పష్టం గా ఉన్నాయి...

సర్వేజనా సుఖినోభవంతు...

10 comments:

రసజ్ఞ September 22, 2011 at 12:59 PM  

హార్థిక జన్మదిన శుభాకాంక్షలు జాహ్నవి గారు!

xyz September 22, 2011 at 2:10 PM  

Happy Birthday to you !

PUSHYAMI September 22, 2011 at 2:13 PM  

పుట్టిన రోజు శుభాకాంక్షలు

PUSHYAMI September 22, 2011 at 2:13 PM  

పుట్టిన రోజు శుభాకాంక్షలు

Kishan September 22, 2011 at 9:07 PM  

belated happy Birthday. మనల్ని మనం తెలుసుకోవటమే గెలుపుకి తొలిమెట్టు. ఆ ఆత్మ పరిశీలనా మీలో మొదలైంది కాబట్టి మీరు గెలుపు బాటలోనే ఉన్నారు, అలాగే ముందుకి సాగిపొండి..

మాలా కుమార్ September 24, 2011 at 7:40 AM  

Happy Birthday.

krsna October 1, 2011 at 7:44 AM  

Belated Happy B'day (sorry the delay).

జాహ్నవి October 6, 2011 at 8:15 AM  

రసజ్ఞ గారు ,xyz గారు ,PUSHYAMI గారు , మాలా కుమార్ గారు ధన్యవాదములు.

జాహ్నవి October 6, 2011 at 8:26 AM  

Kishan గారు ధన్యవాదములు. నేను కూడా అలానే అనుకుంటున్నాను.

జాహ్నవి October 6, 2011 at 8:27 AM  

krsna gaaru,
Its OK. Thanks for your wishes.

Back to TOP