నాన్నంటే.... ఓ ధైర్యం
>> Sunday, June 21, 2009
నాన్న... ఈ మాటంటే మన పెదవులు దూరమవుతాయి. ఎందుకంటే మనల్ని మనసుతో ప్రేమించి చేతల్తో భయపెడతాడు నాన్న. అందుకే పెదవులు సైతం ఆ మాట పలికేటప్పుడు దూరమవుతాయి.
అమ్మ గురించి ఎంతో వ్రాయగలం. కాని నాన్న గురించి అంత వ్రాయలేం కారణం నాన్న ప్రేమని మనసులోనే దాచేసుకుంటారు అలానే మనం కూడా నాన్న మీద ప్రేమని వ్యక్తపరచలేం.
నా దృష్టిలో అమ్మంటే ఓర్పు, సహనం ; నాన్నంటే ధైర్యం.
ఎందుకంటే తల్లి దూరమైన లేదా తల్లి లేని వాతావరణంలో పెరిగిన పిల్లల్లో చాలా మందికి ఓర్పు తక్కువగా ఉంటుంది.
తండ్రి దూరమైన పిల్లల్లో ధైర్యం తక్కువగా ఉంటుంది. పెద్దయ్యాక ధైర్యం వచ్చినా చిన్నప్పుడు వారు కొంచెం పిరికి వారు గానే ఉంటారు. ఆడపిల్లల విషయంలో ఇది 96% నిజం.
నాన్నకి ఇది ఇష్టం ఉండదు. ఇలా చేస్తే నాన్న కొడతారు , తిడతారు అని చెప్పి అమ్మే ఎక్కువగా మనల్ని భయపెడుతుంది. లేకుంటే పిల్లలు తల్లి తండ్రులలో ఎవరికీ భయపడరని. కాని అమ్మ దగ్గర ఆటలు సాగనప్పుడు నాన్న దగ్గరకే వెళ్తాం కదా మనం. అదే నాన్న ప్రేమ.
పిల్లల పెంపకంలో తల్లి తండ్రులిరువురూ సమాన పాత్ర పోషించాలి. లేదంటే పిల్లల్లో సహనమో, ధైర్యమో తక్కువవుతుంది.
నా ఎదుగుదలలో మా అమ్మ పాత్ర ఉంది. మా నాన్న పాత్ర కూడా ఉంది. కాని ఇద్దరి పాత్ర పూర్తి వ్యతిరేకం. :-)
నాన్న కోసం ఎంతో వ్రాయాలని అనుకున్నా. కాని ఏమీ వ్రాయలేకపోతున్నా........ :-(
పితృ దినోత్సవ మహోత్సవ సందర్బంలో ఒక పాట..
http://www.chimatamusic.com/playcmd.php?plist=1668
(స్పీకర్స్ సరిలేక పాట కోసం కష్టపడుతున్న సమయంలో జ్యోతి గారి సహాయం మరువలేనిది. ధన్యవాదములు)
(చిత్రపటాన్ని ఇచ్చిన గూగులమ్మకి ధన్యవాదములు)
13 comments:
జాహ్నవి గారు,
చాలా బాగా రాసారు.
అదేమిటో కనీసము సినిమాలలో కుడా ఆ ఒక్క పాట తప్ప నాన్న మీద పాటలే లేవు.
పైగా నాన్నంటే ఓ జోకర్ లా లేదా ఓ .చండశాసనుడి లా చూపుతారు.
హాపీ ఫాదర్స్ డే.
ఝాహ్నవి,చెప్పలేకపోయాను అని అంతా చెప్పేసారుగా క్లుప్తంగా. నాది కవితా బాణి. మీకది రుచిస్తే నా మనసు ఇక్కడ చూడండి "ఆ నాన్న కూతురు!!!" http://maruvam.blogspot.com/2009/06/blog-post_21.html లేదా ఈ రోజు సాయంత్రం ఆ టపాకే నా వ్యాఖ్యలో వచనం వస్తుంది అది చూడండి. కేవలం నాన్నల పట్ల గౌరవాభిమానాల వలన పంచుకున్న ఈ భావాలు/అనుభవాలన్ని చదువుతున్నాను. నాదీ మీకు అందుకే పంచాను.
బావుంది జాహ్నవిగారూ !నాన్న గురించి టపా రాద్దామనుకుంటూనే రాయలేక పోతున్నా ! అసలు అమ్మ కంటే నాన్నగారంటే నాకు ఎక్కువ ఇష్టం .
పితృ దినోత్సవ శుభాకాంక్షలు .
నాకు ఒక విషయం అర్ధం అవదు, పొద్దుటనుండీ ఇంట్లోనే ఉన్నాను, కానీ మా అబ్బాయి దీనిగురించి ఏమీ మాట్లాడలెదు. సాయంత్రం, మా అమ్మాయి వచ్చి, ఓ కార్డూ,గిఫ్టూ ఇచ్చింది.అలాగని మా అబ్బాయికి నామీద అభిమానం లేదనలెనుగా.ఎలాగైనా ఆడపిల్లలు తండ్రంటే అభిమానం ఎక్కువ చూపిస్తారనుకుంటా.
బాగా రాసేరు జాహ్నవి... నాకు కూడా నాన్నంటే ఇష్టం అమ్మ కన్నా కూడా
బాగుంది.
మాలా కుమార్ గారు, ఉష గారు, పరిమళం గారు, harephala gaaru, భావన గారు, టింగురంగడు గారు ధన్యవాదములు.
నాకు నాన్నంటే ఇష్టం. అమ్మంటే ఇంకా ఇష్టం.
sorry andi chala late ga chusthunnau me blog chlala bagundi andii nanna meda meru cheppindi
Please watch my postings also
వర్మ గారు ధన్యవాదములు. మీ బ్లాగ్ ని చూశాను. కామెంటేసాను చూడండి. మీ బ్లాగ్ + మీ కవితలు అదుర్స్ అండి.
చాలా బాగుంది జాహ్నవి గారూ.. నాన్న అంటే పెదవులు దూరమవుతాయేమోగానీ.. నాలుక, 'నా' అని రెండు సార్లు నొక్కి పలుకుతుంది. ఆ నొక్కివక్కాణించడంలో he is all mine అన్న భావన రావడంలేదూ.. మంచి విషయం చెప్పారు.. బాగా చెప్పారు అభినందనలు.
ఆత్రేయ గారు బాగా చెప్పారండి. నేనింత వరకు అలా ఆలోచించలేదు.
ధన్యవాదములు.
జాహ్నవి గారు అమ్మ మనల్ని 9 నెలలు మోస్తుంది ఆ రకం గా కడుపు తీపి పెంచేసుకుంటుంది అది సహజం ..కానీ నాన్న మనం పుట్టగానే తనది అని అక్కున చేర్చేసుకుంటారు..నా బిడ్డలకు ఏం లోటు ఉండకూడదని రాత్రి పగలు కష్ట పడతారు ..అలాంటి నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే ..బాగా రాసారు
నేస్తమా గారు బాగా చెప్పారు ఎంతైనా మీరు మీరే...
Post a Comment