ఈ - ప్రశ్న కి నా సమాధానం
>> Wednesday, December 16, 2009
17-12-2009 ఈనాడు ఐ.టి పేజి లో ఈ - ప్రశ్న కి నా సమాధానం
పేరు తప్పు వచ్చింది.
మనసు తీరం
17-12-2009 ఈనాడు ఐ.టి పేజి లో ఈ - ప్రశ్న కి నా సమాధానం
పేరు తప్పు వచ్చింది.
పంచ పాండవుల పేర్లు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు.
ఈ విషయం మన అందరికీ తెలుసు. కానీ ఈ పేర్ల వెనక అంతరార్దం భక్తి చానెల్ లో గరికపాటి వారు చాలా బాగా విశ్లేషించి చెప్పారు.
పంచ పాండవులలో పెద్దవాడు ధర్మరాజు ఆయన మాట తమ్ములెవరూ జవదాటరు. అంటే అతని మాటకు వారందరూ డు – డు అంటారు (తల ఊపి సరే అంటారు. అలానే నడుచు కుంటారు) అందుకే ధర్మరాజు తమ్ములందరి పేర్ల చివర “డు” ఉంటుంది ట.
భీముడు
అర్జునుడు
నకులుడు
సహదేవుడు
ఇది సరదాగా చేసిన విశ్లేషణ. ఎవరినీ ఉద్దేశ్యించినది కాదు, నొప్పించాలని కాదు.
Read more...
నాన్న... ఈ మాటంటే మన పెదవులు దూరమవుతాయి. ఎందుకంటే మనల్ని మనసుతో ప్రేమించి చేతల్తో భయపెడతాడు నాన్న. అందుకే పెదవులు సైతం ఆ మాట పలికేటప్పుడు దూరమవుతాయి.
అమ్మ గురించి ఎంతో వ్రాయగలం. కాని నాన్న గురించి అంత వ్రాయలేం కారణం నాన్న ప్రేమని మనసులోనే దాచేసుకుంటారు అలానే మనం కూడా నాన్న మీద ప్రేమని వ్యక్తపరచలేం.
నా దృష్టిలో అమ్మంటే ఓర్పు, సహనం ; నాన్నంటే ధైర్యం.
ఎందుకంటే తల్లి దూరమైన లేదా తల్లి లేని వాతావరణంలో పెరిగిన పిల్లల్లో చాలా మందికి ఓర్పు తక్కువగా ఉంటుంది.
తండ్రి దూరమైన పిల్లల్లో ధైర్యం తక్కువగా ఉంటుంది. పెద్దయ్యాక ధైర్యం వచ్చినా చిన్నప్పుడు వారు కొంచెం పిరికి వారు గానే ఉంటారు. ఆడపిల్లల విషయంలో ఇది 96% నిజం.
నాన్నకి ఇది ఇష్టం ఉండదు. ఇలా చేస్తే నాన్న కొడతారు , తిడతారు అని చెప్పి అమ్మే ఎక్కువగా మనల్ని భయపెడుతుంది. లేకుంటే పిల్లలు తల్లి తండ్రులలో ఎవరికీ భయపడరని. కాని అమ్మ దగ్గర ఆటలు సాగనప్పుడు నాన్న దగ్గరకే వెళ్తాం కదా మనం. అదే నాన్న ప్రేమ.
పిల్లల పెంపకంలో తల్లి తండ్రులిరువురూ సమాన పాత్ర పోషించాలి. లేదంటే పిల్లల్లో సహనమో, ధైర్యమో తక్కువవుతుంది.
నా ఎదుగుదలలో మా అమ్మ పాత్ర ఉంది. మా నాన్న పాత్ర కూడా ఉంది. కాని ఇద్దరి పాత్ర పూర్తి వ్యతిరేకం. :-)
నాన్న కోసం ఎంతో వ్రాయాలని అనుకున్నా. కాని ఏమీ వ్రాయలేకపోతున్నా........ :-(
పితృ దినోత్సవ మహోత్సవ సందర్బంలో ఒక పాట..
http://www.chimatamusic.com/playcmd.php?plist=1668
(స్పీకర్స్ సరిలేక పాట కోసం కష్టపడుతున్న సమయంలో జ్యోతి గారి సహాయం మరువలేనిది. ధన్యవాదములు)
(చిత్రపటాన్ని ఇచ్చిన గూగులమ్మకి ధన్యవాదములు)
మా మంచి చిన్నన్నయ్య GV (గోపాల్ వీరనాల) అన్నయ్యకు పెళ్లి రోజు (మే 15) శుభాకాంక్షలు తెలుపుతూ .......
ఈ పాటను వీక్షించాలని కోరుకుంటూ........
ఆ దేవుడు మీకు , మా వదినకు ఆయుః ఆరోగ్యాలని ప్రసాదించాలని
ప్రార్దిస్తూ......
- మీ చిట్టి చెల్లెలు
జాహ్నవి
Read more...ప్రత్యామ్నాయం లేని రూపం - అమ్మ
సేవ లోనే శెలవు కోరుకునేది - అమ్మ
అసలు నా దృష్టిలో అమ్మంటే -
అమ్మ - అ + మ + మ
అ - అందరినీ
మ - మరిపించేది
మ - మరిచిపోలేని బందం
ఈ మాతృమూర్తుల దినోత్సవం రోజున మా అమ్మను గురించి నా బ్లాగ్ లో...
మా అమ్మ పేరు సంఘమిత్ర . ఉద్యోగిని . సాయంత్రం 5-00 గంటలకు వచ్చే ఉద్యోగం మాత్రం కాదు. 8-00 , 9-00 అవుతూ ఉంటుంది మా అమ్మ ఆఫీసు నుండి వచ్చే సరికి. అప్పుడు కూడా అన్ని పనులు ఎంతో ఓపిగ్గా చేస్తుంది మా అమ్మ.
ఓపిక + ఆత్మ విశ్వాసం + ధైర్యం = మా అమ్మ.
ఈ మూడు గుణాలు నాలో కాస్తంత ఎక్కువని నా స్నేహితులు అంటుంటారు. ఈ గుణాల విషయంలో నేను నా నేస్తాలకి రోల్ మోడల్ కూడా. కాని ఈ విషయాలన్నీ నేను మా అమ్మను చూసే నేర్చుకున్నాను.
ఈ మధ్యనే మా జీవితంలో జరిగిన సంఘటన....
మా అమ్మకి కుడి చేయి మొన్నామధ్యన ఫ్రాక్చర్ అయ్యింది. అప్పుడు ఇంటి పనుల భాద్యత నా మీద పడింది. నాకేమో ఉద్యోగం వచ్చిన కొత్త. ఉద్యోగానికి శెలవు పెట్టడానికి వీలవ్వని పరిస్తితి. ఇంటి పనులు, వంట పనులు, ఇంటికి కావల్సినవి కొనడం, బిల్స్ కట్టడం, ఆఫీసు పనులు ఇంక ఒకటేమిటి? అన్ని పనులు... నేనే చేసేదాన్ని. నన్ను చూసి మా బంధువులు అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయసులో ఇన్ని పనులు నే ఒక్కదాన్నే ఎలా చేసేదాన్నా అని?
అది అంతా మా అమ్మ మహిమ. మా అమ్మ చేసే ప్రతి పనిని నేను గమనించేదాన్ని. అలానే అన్ని పనులు నేర్చుకున్నాను. ఆ టైం లోనే కొత్త వంటలు కూడా చేశాను. ఎప్పటి పనులు అప్పుడు చేయకుంటే మా అమ్మ ఎక్కడ ఆ పనులు చేసేస్తాదోనని నా భయం. నేను కష్టపడిపోతున్నానని మా అమ్మ భాధ. మొత్తానికి మా అమ్మ చేయి బాగయ్యాక నేను అన్ని పనులు చేయలేదు కాని కొన్ని పనులు మాత్రం చేస్తున్నాను.
మా అమ్మ చేస్తున్న పని - వంట వండటం
నేను చేస్తున్న పని - దాన్ని ఆరగించడం
మా అమ్మ చేస్తున్న పని - ఇంటికి సామానులు కొనడం
నేను చేస్తున్న పని - వాటిని క్రమ పద్దతిలో సద్దడం
ఇలా నేను , మా అమ్మ పనులని సద్దుకుంటున్నాం :-)
నాకు ఉద్యోగం శాశ్వతం (permanent) అయ్యాక నేను మా అమ్మని ఏ మాత్రం కష్టం లేకుండా పోషించగలను అనే నమ్మకం వచ్చిన తర్వాత నేను చేసే మొదటి పని .. మా అమ్మ చేత వాలెంటరీ రిటైర్ మెంట్ ఇప్పించడం. ఆ తర్వాత ఇంట్లో కూడా ఏ పని చేయనివ్వను. మా అమ్మకి ఇష్టమైన అధ్యాత్మిక పుస్తకాలకి జీవిత చందా కట్టడం. నాకు ఉద్యోగం వచ్చి ఎక్కడ వున్నా కూడా మా అమ్మని అక్కడకి తీసుకువేళ్ళే వరం కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా ఎప్పుడూ...
నా ఈ కోరిక నిజం అవుతుందని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ముక్కోటి దేవతల దీవెనలని మించిన మా అమ్మ దీవెన నాకుందని..
ఔనంటారా...?
Back to TOP