దెయ్యం ఆట
>> Thursday, April 12, 2012
అవి నా చిన్నప్పటి రోజులు.
అప్పట్లో స్కూలు నుండి వచ్చి, ఆడుకోవడానికి వీలు లేకుండా హోం వర్క్ వెంటనే చేయాల్సి వచ్చేది. మళ్ళీ ఏడైతె కరెంట్ పోయేది. మల్లీ ఎనిమిది, ఎనిమిదన్నర వరకూ వచ్చేది కాదు :-( నా చిన్నప్పుడు ఎనిమిది అంటే ఏదో రాత్రి అయిపోయినట్టు. (ఇప్పడయితే ఎనిమిదయినా, తొమ్మిదయినా ఇంకా ఆఫీసులోనే ఉండాల్సి వస్తుంది)
ఇంక కరెంటు పోతే పిల్లలందరూ బయట చేరి ఆడుకునేవాళ్లు. ఆడుకునేవాళ్లు అని అంటే నేను చిన్నదాన్నైనా ఆడేదాన్ని కాను. దానికి కారణం మరో పోస్ట్ లో చెప్తాను. :-) (మరి అది చాలా పెద్ద కారణం) పాపం నాకు కంపెనీ ఇద్దామని మా ఇంట్లో అద్దెకుండేవారిపిల్లలు నా పక్కనే కూర్చునేవారు.
ఒకసారి మా స్కూల్లో ఒక అమ్మాయి మరొక అమ్మాయిని దెయ్యం పేరు చెప్పి భయపెట్టింది. నెను వీళ్ళ దగ్గర ట్రై చేశా :-) వీళ్ల పేర్లు అదే అండి నాకు కంపెనీ ఇచ్చే వారి పేర్లు సువర్ణ, శేఖర్.
పాపం వీళ్లు కూడా నాలాగే ఆడుకునే పిల్లల్ని చూస్తూ కూర్చునేవారు. నేను వీళ్ల పక్కనే కూర్చునేదాన్ని. అప్పుడే ట్రై చేయాలనే ఆశ పుట్టింది. కొంచెం గొంతు మార్చి.. సువర్ణా అని నేను అంటే.. ఏంటి రమణీ అనేది.. కొంచెం భయపడుతూ... ఆదివారం ... అర్దరాత్రి... సరిగ్గ పన్నెండు గంటలు..... ఒక భయంకరమైన నవ్వు నవ్వేదాన్ని. ఇంతలో మా సువర్ణ అమ్మా.. అని ఏడుపు మొదలుపెట్టేది.. పాపం మా ఆంటీ వచ్చి ఏమయ్యిందమ్మ అని అడిగేది. నా నిర్వాకం గురించి చెప్పేది... మా ఆంటి ఒకటి రెండు సార్లు ఊరుకునేది. ఎక్కువ చేస్తే.. ఏమీ తిట్టేవారు కాదు. ఒక్కసారి ఏయ్ రమణి... అనేవారు అంతే.. నాకు ఆవిడంటే అంత భయం :-( (ఇంకా కోపం కూడా చాలా ఎక్కువ, అది మరో పోస్ట్) ఇంతకీ నాకు భయపెట్టడం కూదా అంతే వచ్చు. అంతకన్నా మా స్కూల్లో అమ్మయి నాకు మరి ఎక్కువ నేర్పించలేదు మరి. :-)
ఇప్పుడు ఇక్కడ కూడా పవర్ కట్ ఎక్కువగా ఉండటం వలన ఇవి అన్నీ గుర్తు వచ్చేస్తున్నాయి.. వరుసగా... :-)
0 comments:
Post a Comment