ప్రతిలిపి లో నా కథ

>> Friday, May 4, 2018

నేను వ్రాసిన "చెరసాల" అను కథ ప్రతిలిపి వారి వెబ్సైట్ లో ప్రచురించారు.

https://telugu.pratilipi.com/read?id=5690409982885888

చదివి మీ అమూల్యమైన అభిప్రాయం ను తెలుపగలరు.

Read more...

సేవా సంస్థలు - వివరాలు

>> Sunday, February 16, 2014



ఎన్నో పత్రికల నుండి, బ్లాగుల నుండి సంగ్రహించిన వివరాల ఆధారంగా క్రింది డాటాను తయారుచేశాను. అవసరమైన వ్యక్తులకు చేరవేయాలనే ఆలోచనతో బ్లాగులో పెడుతున్నాను. దయచేసి షేర్ చేసి అవసరమైన వారికి తెలియచేయండి

Read more...

ప్రజా డైరీ జూన్ మాస పత్రికలో ఎస్.ఇ.ఒ. పై నా వ్యాసం

>> Tuesday, August 7, 2012


Read more...

తెలుగు వికీలో నా వ్యాసం - కాంచన మాల

>> Monday, June 11, 2012


నటి కాంచన మాల... తొలిసారి ఈ పేరు విన్నది నేను పాఠశాలలో చదువుకునే రోజుల్లో.. అప్పట్లో మా ఇంట్లో టి.వి. లేదు :-( పేపర్ తీసుకునే వారనుకుంటాను.. గుర్తు లేదు :-( ఈ టి.వి. లో మధ్యాహ్నం 'మాలపిల్ల ' సినిమా అని పేపర్లో చదివాను. చాలా వ్రాశారు సినిమా గురించి. మాకు ఆ సినిమా వచ్చే ముందు వారంలోనే ఎందుకో కొన్నిరోజులు ఒంటిపూట బళ్లు ఉన్నాయి. అప్పట్లోనే కళాపోసణ తో తెలిసిన వాళ్లింట్లో మా అమ్మ అనుమతితో సినిమా చూద్దామనుకున్నా.. కానీ వాళ్లకి మరో సినిమా మీద ఆసక్తితో... నా ఆశ అడియాసయ్యింది....

అవి నేను కాలేజి చదువుతున్న రోజులు.. ఎందుకో మరి ఆరోజు కాలేజి లేదు.. ఆదివారమేమో !!! గుర్తు కూడా లేదు..:-) ఆ రోజు మధ్యాహ్నం.. ఈ సారి మా ఇంట్లోనే టి.వి. ఉంది. ఈ సారి ఈ టి.వి. 2 సఖి కార్యక్రమం... నటి కాంచన మాల కోసం మరిన్ని విషయాలు.. ఆమెకి జెమినీ వాసన్ గారితో గొడవ జరగకపోయి ఉంటే.. ఆమెకి ఇంకా మరెంతో పేరు వచ్చేదని చెప్పారు. ఎందుకో ఒక్కసారి గుండె కలుక్కుమంది. మన ఆవేశ కావేశాల మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉండటం అంటే ఇదే కదా అని అనుకున్నాను...

అవి నేను పెద్ద కాలేజి (పి.జి.) చదువుతున్న రోజులు. ఒకసారి పుస్తక ప్రదర్శనలో నేను చూసిన అనేక పుస్తకాలలో ఒక పుస్తకం నన్ను అలరించింది... అదే కాంచన మాల జీవిత చరిత్ర. మొదటి సారి ఆమె ఫొటోని అందులోనే చూశాను. పావు గంట లో అయిదారు పేజీలు చదివేశాను (నేను అశ్వినీ నాచప్ప పరిగెత్తినట్టు చదువుతానులెండి). ఇప్పుడు మా అమ్మని ఈ పుస్తకం కొనమంటే కొంటుందో లేదో అని భయం :-( పుస్తకం ఖరీదెక్కువ... అదీ కూడ పాఠ్యాంశాలకి సంబంధించింది కాదు. ఎట్టకేలకు మా అమ్మని ఒప్పించాను. పుస్తకం అంతా ఒకరాత్రిలో చదివేశాను. కానీ వారం రోజుల వరకూ మామూలు మనిషిని అవ్వలేకపోయాను.(చదువుకునే రొజులు కదా అందుకే మనసు అంత సున్నితం)

ఇంతకీ ఒక టైటిల్ పెట్టి నా జీవిత కధ చెప్తున్నా అని అనుకుంటున్నారా?? ఆ పుస్తకం లో ఉన్న విషయాలు... ఇంకా సేకరించిన కొన్ని విషయాలతో కాంచనమాల గారి మీద ఒక పోస్ట్ వ్రాశాను ఇదివరకు నా బ్లాగులో. ఆ వ్యాసం యొక్క మూలంతో తెలుగు వికీ లో ఒక వ్యాసం వచ్చింది. :-)

మొట్ట మొదటి సారి వికీ కోసం ఒక స్నేహితురాలు చెప్పినప్పుడు ఇలాంటి సైట్ ఒకటి ఉంటుందా అని ఆశ్చర్యపడిన ఒక అమ్మాయి.. తన బ్లాగు లో ముచ్చట పడి వ్రాసుకున్న వ్యాస మూలంతో వికీ లో ఒక పేజి ఉందంటే..... :-) గాల్లో తేలినట్టుంది... గుండె పేలినట్టుంది... మా మేనేజర్ ఫుల్ హైక్ ఇచ్చినట్టుంది.. :-)

వికీ లింక్ కోసం ఇక్కడ చూడండి.

నా బ్లాగు లో కాంచన మాలగారిపై పోస్ట్ కోసం ఇక్కడ చూడండి.

**పసుప్పచ్చని అక్షరాలు కనిపించకపోతే వాటిని మౌస్ తో సెలెక్ట్ చేసి చదవగలరు.

Read more...

విహంగ మహిళా సాహిత్య పత్రికలో నా కవిత 'కుల మతాలు'

>> Wednesday, May 2, 2012

విహంగ వారు సరస్వతి గోరా గారి స్మృత్యర్దం కవితలను అహ్వానించిన విషయం మనకు తెలిసిందే. సరస్వతి గోరా గారు ఈ తరం స్త్రీలకు ఎంతటి ఆదర్శమో, ఆనాడు మూఢనమ్మకాలకు వ్యతిరేఖంగా ఎలా పోరాడారో క్లుప్తంగా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి.

నా కవితను ఇక్కడ చూడండి.

Read more...

సేవ తెలుగు అంతర్జాల పత్రికలో 'శ కారం పై నా వ్యాసం

>> Saturday, April 28, 2012


ఈ కాలంలో మనం శ కారాన్ని ఎంత వరకు, ఎలా ఉపయోగిస్తున్నాం అనే విషయంపై నేను వ్రాసిన వ్యాసం సేవ తెలుగు అంతర్జాల పత్రికలో ప్రచురితమైనది. ఇక్కడ చూడగలరు.

నా వ్యాసాన్ని ప్రచురించిన సంపాదక వర్గానికి బ్లాగు ముఖతః ధన్యవాదములు.

Read more...

దెయ్యం ఆట

>> Thursday, April 12, 2012

అవి నా చిన్నప్పటి రోజులు.
అప్పట్లో స్కూలు నుండి వచ్చి, ఆడుకోవడానికి వీలు లేకుండా హోం వర్క్ వెంటనే చేయాల్సి వచ్చేది. మళ్ళీ ఏడైతె కరెంట్ పోయేది. మల్లీ ఎనిమిది, ఎనిమిదన్నర వరకూ వచ్చేది కాదు :-( నా చిన్నప్పుడు ఎనిమిది అంటే ఏదో రాత్రి అయిపోయినట్టు. (ఇప్పడయితే ఎనిమిదయినా, తొమ్మిదయినా ఇంకా ఆఫీసులోనే ఉండాల్సి వస్తుంది)
ఇంక కరెంటు పోతే పిల్లలందరూ బయట చేరి ఆడుకునేవాళ్లు. ఆడుకునేవాళ్లు అని అంటే నేను చిన్నదాన్నైనా ఆడేదాన్ని కాను. దానికి కారణం మరో పోస్ట్ లో చెప్తాను. :-) (మరి అది చాలా పెద్ద కారణం) పాపం నాకు కంపెనీ ఇద్దామని మా ఇంట్లో అద్దెకుండేవారిపిల్లలు నా పక్కనే కూర్చునేవారు.
ఒకసారి మా స్కూల్లో ఒక అమ్మాయి మరొక అమ్మాయిని దెయ్యం పేరు చెప్పి భయపెట్టింది. నెను వీళ్ళ దగ్గర ట్రై చేశా :-) వీళ్ల పేర్లు అదే అండి నాకు కంపెనీ ఇచ్చే వారి పేర్లు సువర్ణ, శేఖర్.
పాపం వీళ్లు కూడా నాలాగే ఆడుకునే పిల్లల్ని చూస్తూ కూర్చునేవారు. నేను వీళ్ల పక్కనే కూర్చునేదాన్ని. అప్పుడే ట్రై చేయాలనే ఆశ పుట్టింది. కొంచెం గొంతు మార్చి.. సువర్ణా అని నేను అంటే.. ఏంటి రమణీ అనేది.. కొంచెం భయపడుతూ... ఆదివారం ... అర్దరాత్రి... సరిగ్గ పన్నెండు గంటలు..... ఒక భయంకరమైన నవ్వు నవ్వేదాన్ని. ఇంతలో మా సువర్ణ అమ్మా.. అని ఏడుపు మొదలుపెట్టేది.. పాపం మా ఆంటీ వచ్చి ఏమయ్యిందమ్మ అని అడిగేది. నా నిర్వాకం గురించి చెప్పేది... మా ఆంటి ఒకటి రెండు సార్లు ఊరుకునేది. ఎక్కువ చేస్తే.. ఏమీ తిట్టేవారు కాదు. ఒక్కసారి ఏయ్ రమణి... అనేవారు అంతే.. నాకు ఆవిడంటే అంత భయం :-( (ఇంకా కోపం కూడా చాలా ఎక్కువ, అది మరో పోస్ట్) ఇంతకీ నాకు భయపెట్టడం కూదా అంతే వచ్చు. అంతకన్నా మా స్కూల్లో అమ్మయి నాకు మరి ఎక్కువ నేర్పించలేదు మరి. :-)

ఇప్పుడు ఇక్కడ కూడా పవర్ కట్ ఎక్కువగా ఉండటం వలన ఇవి అన్నీ గుర్తు వచ్చేస్తున్నాయి.. వరుసగా... :-)

Read more...

Back to TOP