మా అమ్మకి ఉత్తమ ఉద్యోగిని పురస్కారం

>> Thursday, January 26, 2012

మా అమ్మ ఉత్తమ ఉద్యోగినిగా గణతంత్ర దినోత్సవం నాడు కలెక్టరు గారి చేతులమీదుగా పురస్కారం అందుకున్నారు. పిల్లలు వృద్ది లోనికి వస్తే తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారో ఇంత వరకూ ఎందరో ఎన్నో విధాలుగా తెలిపారు. కానీ ఈరోజు మా అమ్మకి ఈ పురస్కారం లభిస్తే ఆమె బిడ్డగా నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పడం నాకు రావడం లేదు. నాకు మళ్లీ జన్మ ఉండకూడదనే కోరుకుంటున్నాను. ఒకవేళ ఉంటే మాత్రం మా అమ్మ కి అమ్మ గా పుట్టాలనే ఆ దేవుణ్ణి ప్రార్దిస్తున్నాను. మా అమ్మ గురించి ఇంతకు ముందు ఒకసారి నేనేమని వ్రాసుకున్నానంటే... ఇక్కడ చూడండి ఓమారు ...




Read more...

కౌముది లో నా కవిత పరదేశి

>> Tuesday, January 17, 2012

నా కవిత పరదేశి ఈ నెల జనవరి కౌముది లో ప్రచురితమైనది. ప్రచురించినందుకు కౌముది వారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదములు తెల్పుకుంటున్నాను. ఇక్కడ నొక్కి కౌముది కి వెళ్లగలరు.







Read more...

హారం పత్రిక సంక్రాంతి పోటీలో మొదటి బహుమతి పోందిన నా కవిత

>> Tuesday, January 10, 2012

హారం పత్రిక వారు నిర్వహించిన సంక్రాంతి పోటీలో ఒక విభాగంలో నా కవితకు మొదటి బహుమతి వచ్చిందోచ్. హారం వారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.ఈ సారి సంక్రాంతికి ఇంటికి వెళ్లడానికి శెలవు దొరకలేదని భాధపడుతుంటే...నాకు సంక్రాంతి ఈ బహుమతి రూపంలో రెండురోజుల ముందే వచ్చేసిందోచ్... ఆనందమానందమాయే... :-)

హారం పత్రికను ఇక్కడ, బహుమతి పొందిన నా కవితను ఇక్కడ చూడవచ్చు.
అందరికీ ముందుగానే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.



నేస్తం

మది దాటని మాటలన్నీ
మూటగా కట్టి
మనసెరిగిన నేస్తానికి
చిరుకానుకగా అందించాలని

ఊసులన్నీ గుట్టగా పోసి
బాల్య స్మృతులతో కలగలిపి
నీ కోసం వేచిఉంటే

జ్ఞాపకాల నీలి నీడలను నాకు వదలి
ప్రేమతో పెనవేసిన బంధాన్ని మర్చిపోయి
అందుకోలేని తీరాలకు....
అందరినీ వదిలేసి
నన్నొంటరిని చేసి
వీడ్కోలు పలికావా నేస్తం !!!

ఎన్నటికీ రాలేని నీ కోసం
నీ జ్ఞాపకాలు మరువని నేస్తం...

Read more...

ప్రతీక్ ఇంక లేడు..

>> Wednesday, October 19, 2011

ప్రతీక్ గురించి ఇదే మొదటి సారి చూడడం అయితే ఒక్కసారి ఈ లింక్ ని చూడండి.

నేను అప్పుడప్పుడు ప్రతీక్ వాళ్ల బంధువులకి ఫోన్ చేస్తూ ఆ పిల్లవాడి క్షేమ సమాచారం తెలుసుకునేదాన్ని. ప్రతీ సారి ఆరోగ్యం మెరుగు పడుతుందనే చెప్పేవారు. పరిస్తితి ఆశాజనకం గానే ఉందని సంతోషించాను. డోనర్ కూడా దొరికారు అతితక్కువ కాలంలోనే...నిజంగా అదృష్టమనుకున్నాను. కానీ ఒకరోజు కొంచెం సీరియస్ అన్నారు. ఆ తర్వాత పని వత్తిడిలో పడి నేనే వాళ్లకి కాల్ చేయలేదు. వాళ్ల బ్లాగు కూడా చూడలేదు. ఈరోజే మళ్లీ బ్లాగు చూసేసరికి ఈ వార్త... ఒక్కసారి కూడా ఆ అబ్బాయిని చూడని నాకే ఇంత భాధ అనిపిస్తుంటే... ఇంక వారి అమ్మా, నాన్నలకి ఎలా ఉంటుందో...

ప్రతీక్ ఆత్మకి శాంతి చేకూరాలని.....
ఆ తల్లిదండ్రులు ఈ భాధ నుండి తేరుకుని మామూలు ప్రపంచంలోనికి రావాలని మనస్పూర్తిగా ఆ పైవాణ్ణి కోరుకుంటున్నాను.

Read more...

కౌముది లో నా యాత్రా స్పెషల్ - అన్నవరం

>> Sunday, October 16, 2011

అప్పుడెప్పుడో ఒకసారి పక్కన వున్న అన్నవరానికి వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలు కౌముది వారి యాత్రా స్పెషల్ లో ఈ నెల ప్రచురితమైనాయి. ప్రచురించినందుకు కౌముది వారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదములు తెల్పుకుంటున్నాను.
ఇక్కడ నొక్కి కౌముది కి వెళ్లగలరు.

Read more...

సంక్రాంతి టు విజయ దశమి

>> Thursday, October 6, 2011

నావరకైతే ఈరొజే సంక్రాంతి నుండి దసరా వరకు ఉన్న అన్ని పండుగలు వచ్చాయి. అప్పుడెప్పుడో సంక్రాంతికి మా యింటికి వచ్చాను, మళ్లీ ఇప్పుడు వచ్చాను. ఈ మధ్యలో ఉన్న పండుగలు అన్నీ మిస్ అయ్యాను :-( నాకెంతో ఇష్టమైన ఉగాది పండుగను కూడా.. :-( ఈ మూడు రోజులు భక్తితో పూజలు చేసుకుని, కంటి నిండా నిద్ర పోయి, కడుపు నిండా భోజనం చేసి రాజభోగాలు అనుభవించేశా.. ఈ శనివారం మళ్లీ వెళ్లిపోవాలి..:-( ఆ చల్లారిపోయిన చప్పటి చపాతీలు తింటూ ఉండాలి..:-( రోజూ మన వంటలే తింటే వాటి రుచుల్లో గొప్పతనం తెలియదని దేవుడు నన్ను అంత దూరం పడేశాడేమో మరి :-( ఏది ఏమైనా.. జరిగేదంతా మంచికని .. అనుకోవడమే మనిషి పని.. (ఇప్పుడు నేను అంత కన్నా చేయగలిగింది కూడా ఏమీ లేదు) నా బ్లాగు చూసిన వారందరికీ విజయ దశమి శుభాకాంక్షలు. మా యింట్లో ఈరోజు దసరా జరుపుకున్న ఫొటో..





Read more...

పగలు, రాత్రి సమానంగా ఉండే రోజు మళ్లీ వచ్చేసింది...

>> Thursday, September 22, 2011

అవునండీ.. సంవత్సరంలో పగలు,రాత్రి సమానంగా ఉండే రోజు ఈ ఒక్కరోజే. అందుకే ఈరొజు నుండే సూర్యమానం ప్రకారం తులా రాశి మొదలు అవుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అని అనుకుంటున్నారా? మరి ఈ రోజే కదా నేను పుట్టింది. అందుకే ఈ రోజు గురించి ఇంత పరిశోధన.

చిన్నప్పటి నుండి పుట్టిన రోజు అంటే అందరిలానే నాకు కూడా చాలా ఇష్టం. క్లాసులో పుస్తకాల బరువు పెరుగుతున్న కొద్దీ పుట్టిన రోజు మీద ఆసక్తి తగ్గుతూ వచ్చింది. కానీ ఒక కల మాత్రం మిగిలిపోయింది. ఇంక అది తీరదు అని తెలిసిపోయింది అందుకే నా బ్లాగులో వ్రాసేసుకుంటున్నాను. అదేమితంటె.. అర్దరాత్రి సరిగ్గా పన్నెండు గంటలు దాటగానే నాకు బోల్డన్ని ఫోన్ కాల్స్ వచ్చేయాలని, చాల మంది నాకు విషెస్ చెప్పేయాలని కోరిక.. ఒకసారో, రెండు సార్లో అలా జరిగింది. అది కూడా బోల్డన్ని కాదు ఒకటో, రెండో... ఇంక ఈ ఉద్యోగాలలోకి వచ్చాక... పుట్టిన రోజు విషయమే గుర్తు ఉండటం లేదు.. మొత్తానికి చదువుకునేటప్పుడు ఉండే పట్టుదల, ఓపిక, ధైర్యం, ఆశావాహ దృక్పధం అన్నీ ప్రస్తుతం కొరవడ్డాయి నాలో. జీవితమంతా చప్పగా, చేదుగా ఏదోలా ఉంది. కొత్త విషయాలు నేర్చుకోలేనందుకు చప్పగా... ఎంత కష్టపడినా అనుకున్న వాటిలో సగభాగం కూడా సాధించలేనందుకు చేదుగా అనిపిస్తుంది ఈ జీవితం.
ఎప్పుడు ఎలా ఉన్నా.. తీపి మీది మక్కువతో ఉదయించే సూర్యుని చూస్తూ.. ప్రతీ రొజూ ఆశతో ఆశయసిద్ది కోసం ప్రయత్నించడం అలవాటయిపోయింది. ప్రస్తుతానికి నా మనసు, నా ఆలోచనలు కూడా.. ఈ పోస్టు లానే అస్పష్టం గా ఉన్నాయి...

సర్వేజనా సుఖినోభవంతు...

Read more...

Back to TOP