నేను మొబైల్ కొన్న కొత్తలో....
>> Sunday, September 12, 2010
అందరి లానే నాకు మొబైల్ అంటే ఇష్టం ఉండేది మొదట్లో... కానీ భయం ఎక్కువ... ఎందుకంటే.. దాని ఆపరేషన్ రాదు మరి నాకు... ఎట్టకేలకి కొన్ని తప్పనిసరి పరిస్తితులలో మొబైల్ కొన్నాను... మామూలు మొబైల్ కాదు...కె...మె...రా... మొబైల్... చిన్నప్పటి నుండి కెమెరాను కూడా చూడని మొహమేమో నాది... నా మొబైల్ అంటే...నాకు ....భలే ఇష్టం ఉండేది... రోజుకి తక్కువలో తక్కువ ఒక పాతిక వరకూ ఫొటోస్ ని తీసేదాన్ని.. అలా మొబైల్ కొన్న కొత్తలో.. ఒకసారి ఒక బుక్ షాప్ కి వెళ్తే " మాయా బజార్ " సినిమా పుస్తకం కనిపించింది. ఇంట్లో కొనమంటే... కొనరు కదా ( ఈ పెద్దోళ్లు ఉన్నారే...) ఆ పుస్తకానికి అట్ట అదిరిపొయింది. నట దిగ్గజాలు ఉన్నారు మరి ఆ అట్ట మీద... మన దగ్గర మొబైల్ ఉంది కదా.... పండగ చేసుకున్నా.. ఫొటోస్ తీసి... అవే ఇవి...
ప్రతీ సినిమాలో N.T.R. కి S.V.R. తండ్రి గానో బాబాయి గానో నటిస్తారు.. కానీ ఈ సినిమాలో మాత్రం N.T.R. నటించారు S.V.R. మామయ్యలా.. బహుశా.. ఇలా ఈ ఒక్క చిత్రంలోనే నేమో...
Read more...