A - Z Good Qualities

>> Friday, February 29, 2008

ఈ క్రింది లక్షణాలతో మనిషి ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.
అవి :
A - Ability - సామర్ధ్యం
B - Bravery - సాహసం
C - Courage - ధైర్యం
D - Desire - కోరిక
E - Efficiency - సమర్ధత
F - Fellowship - సౌభ్రాతృత్వం
G - Generosity -ఔదార్యం
H - Hope - నమ్మకం
I - Interest - ఆసక్తి
J - Justice - న్యాయం
K - Kindness - దయ
L - Loyalty - విశ్వాసం
M -Man-Hood - మానవత్వం
N - Novel - నూతన
O - Obedience - విధేయత
P - Politeness -మర్యాద
Q - Quickness - చురుకుదనం
R - Rememberence - జ్ఞాపకం ఉంచుకొను
S - Satisfaction - తృప్తి
T - Trial - ప్రయత్నం
U - Unity - ఐకమత్యం
V - Vitality - ఉత్సాహం
W - Wisdom - తెలివి
X -Xenodochy - ఆతిధ్యం
Y - Yearn - ఆపేక్ష
Z - Zeal - పట్టుదల

ఈ పై లక్షణాలన్నీ మనిషి అలవరచుకుంటే తప్పకుండా ఆ మనిషి మహర్షే అవుతారు.
ఈ పై కలబోతలన్నీ నా స్వంతంగా నేనే వ్రాశాను.

Read more...

వధువు కావలెను

>> Saturday, February 23, 2008

ఓ పెద్ద కంపెనీలో ఆకర్షణీయమైన జీతము అందుకుంటున్న వరునకు అందమైన, చురుకైన, P.G. చదివిన వధువు కావలెను.
ఏడడుగుల బంధానికి వధువుకు ఉండవలసిన ఏడు లక్షణాలు:
1)ఆస్తిలేమీ లేకపోయినా అప్పులుండకూడదు. కాని హైదరాబాద్ లో ఓ యిల్లు, లేదా 2,3 చోట్ల స్థలాలు ఉంటే చాలు.
2)అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఒకరు ఉంటే మంచిది. లేకుంటే మరీ మంచిది.
3)వరునికి ఇష్టం లేనప్పుడు ఉద్యోగం మానేసి, ఇష్టం ఐనప్పుడు ఉద్యోగం సంపాదించుకునే తెలివితేటలు ఉండాలి.
4)ఉద్యోగం చేస్తున్నా ఇంటి భాద్యతలు పూర్తిగా నిర్వర్తించాలి.
5)వరకట్నం ఇచ్చే విషయం మీ ఇష్టం కాని వధువుకు వారి తల్లిదండ్రులు ఏమైనా సమర్పించుకోవచ్చు. పెళ్ళి మాత్రం ఘనంగా చేయాలి.
6)వస్త్రధారణ పూర్తిగా మా ఇష్టానుసారంగా ఉండాలి.
7)డిగ్రీలు, ఉద్యోగాలు సంపాదించడమే కాదు వంటా వార్పు కూడా తెలిసుండాలి.
  • ఈ ప్రకటన చాలా మందికి కోపం తెప్పించిఉండవచ్చు. కానీ ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులుకు మాత్రం ఈ ప్రకటన బాగా తెలుసు. స్త్రీ ఎంత చదువుకుని ఉద్యోగం చేస్తున్నా వంటింటి పనులు పూర్తిగా ఆమే చేయాలి. అది ఆమె భాధ్యత. పురుషులు ఎంత చిన్న పని చేసినా అది సహాయమే అవుతుంది కాని భాద్యత కాదు. ఇది నిజంగా నిజం ఎవరైనా కాదంటారా?
  • వరకట్నం వద్దు అనేవారు చాలా అరుదుగా ఉన్నారు. ఒకవేళ వద్దు అన్నా పేరు మారుతుంది కాని లాంచనంగా మాత్రం తీసుకుంటున్నారు.
  • వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేసే మహిళలకి ఆయా ఉద్యోగాల రీత్యా వస్త్రధారణ ఉంటుంది. కానీ అది కూడా ఆక్షేపణల నడుమ నలిగిపోతుంది.

నా ఈ పోస్ట్ చదవుతుంటే ఎంతో మందికి కోపం రావచ్చు. కానీ ఈ పోస్ట్ రాయడానికి ముందు కొన్ని 100ల మంది దగ్గర అభిప్రాయాలను సేకరించాను నేను . వారిలో పెళ్ళి కాని స్త్రీ,పురుషులు ,పెళ్ళి ఐన స్త్రీ, పురుషులు, ఉద్యోగం చేస్తున్న ఆడవారు, ఉద్యోగం చేయని ఆడవారు కూడా ఉన్నరు. కేవలం ఈ పొస్ట్ నా అభిప్రాయ మాలిక కాదు. ఎంతో మంది మనసుపొరలలోని ఆశల రూపం ఈ పోస్ట్.

Read more...

మినీ కవితలు - 9

>> Friday, February 22, 2008

నిరుద్యోగి

ఉత్తర దక్షిణాలివ్వని

నిరుద్యోగి

ఆశగా తూర్పుని చూస్తే

పడమర పిలుస్తోంది


ఇదెక్కడి న్యాయం

నోరు మూసుకుని అన్నీ భరిస్తే

భారతనారిని దేవతన్నారు

కాదని ఎదిరిస్తే

పిదపకాలం అంటున్నారు.

Read more...

నా మాటలు - 1

1)ఈ ప్రపంచంలో తెలివైన వారెవరూ పైకి రాలేదు. కష్టపడి శ్రమించిన వారే పైకి వచ్చారు. కాబట్టి మనం కూడా కష్టపడి లేక ఇష్టపడి శ్రమిద్దాం. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుందాం.
2)మనం పిల్లలుగా చేసిన తప్పులు తెలుసుకునే సరికి తల్లిదండ్రులమవుతాం. మరి మనం తల్లిదండ్రులుగా చేసిన తప్పులు తెలుసుకునే సరికి మన పిల్లలు తల్లిదండ్రులవుతారు.
3)మనం కోరే దాన్ని సాధించడం - విజయం
మనకి దక్కిన దానితో తృప్తి పడటం - ఆనందం

Read more...

గూఢార్దాలు

>> Thursday, February 21, 2008

అన్ని భాషలలో కొన్ని పదాలలో మొదటి అక్షరాన్ని తొలగిస్తే కొత్త పదం తయారవుతుంది. వాటిలో కొన్నింటిని ఇక్కడ పొందుపరుస్తున్నాను. మీకు తెలిసినవి మీరు కూడా నాకు దయచేసి తెల్పండి.
తెలుగు భాషలో:
ధాశరధి - రాముడు
శరధి - అమ్ములపొది
రధి - రధాన్ని ఎక్కినవాడు
ధి - బుద్దిమంతుడు

ఆంగ్ల భాషలో:
1)chair
hair
air

2)price
rice
ice

3)wheat
heat
eat
at
t

Read more...

తెలుగు పదాలు - 1

తెలుగు భాషలో మొదటి నుండి చదివినా, ఆఖరి నుండి చదివినా ఒకేలా ద్వనించే పదాలు చాలా వున్నాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ పొందుపరుస్తున్నాను. మీకు తెలిసినవి మీరు కూడా నాకు దయచేసి తెల్పండి.
ఆ పదాలు:

జలజ
కునుకు
నటన
కిటికి
పులుపు
కందకం
కలక
నవీన
పంచాస్యచాపం
జంబీరబీజం
లకోలకోల
రంగనగరం
కడనడక
గులాబిలాగు
గాదెనాదెగా
దారివారిదా
తోకమూకతో
పాలునలుపా
పాలుతెలుపా
వికటకవి
మందారదామం
మానవకవనమా
వినమనవి
కడపలోపడక

Read more...

తెలుగు పదాలు

తెలుగులో ముందు నుండి చదివినా వెనుక నుండి చదివినా ఒకేలా పలికే మాటలు కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్నింటిని సంగ్రహించి వ్రాస్తున్నా. ఇంకా ఎమైనా ఉంటే మీరు జతపరచండి.

ఆ పదాలు:

జలజ

కునుకు

నటన

కిటికి

పులుపు

కందకం

కలక

నవీన

పంచాస్య చాపం

జంబీర బీజం

ల్

Read more...

Back to TOP