నా దేశం

>> Monday, March 10, 2008

ఇదే ఇదే మన దేశం
సుందర భారత దేశం

తలమానికమే కాశ్మీరం
ముక్కెరయే పంజాబు
గుండెకాయ హస్తినా ... ... ,,ఇదే,,

నేత్రాలే హిమాచలు
నాసికయే అరుణాచలు
కర్ణాలే కర్ణాటక
వదనమే ఉత్తరప్రదేషు ...ఆ..ఆ... ,,ఇదే,,

దక్షిణాస్తమే రాజస్తాన్
ఉత్తరాస్తమే బీహార్
నడుమన మధ్యప్రదేషు ...ఆ..ఆ... ,,ఇదే,,

ఒక పాదం తమిళనాడు
మరు పాదం కేరళ
పంటలనెలవే ఆంధ్ర ...ఆ..ఆ... ,,ఇదే,,

మన స్వాతంత్ర్యం ఎర్రటి పతాకం
వీరుల రుధిరం నుదుటి తిలకం
అయి వెలసెను భారతమాత ...ఆ..ఆ... ,,ఇదే,,

7 comments:

Anonymous March 10, 2008 at 10:40 AM  

దేశభక్తి గేయం రాయగలగటం చాలా గొప్ప విషయం.
జైహింద్
గిరిచంద్, గుజరాత్

జాహ్నవి March 10, 2008 at 9:46 PM  

గిరిచంద్ గారు ధన్యవాదములు.
జైహింద్

Anonymous March 10, 2008 at 11:26 PM  

It's a hilarious piece of writeup.
కాశ్మీరం తలమానికమన్నారు బానే ఉంది. పంజాబు ముక్కెరన్నారు ఇంకా బాగుంది. అలానే పోక, గుండెకాయ హస్తిన అంటూ బాడీ పార్టుల్లోకెందుకు దిగారు? దిగితిరిపో! కళ్ళు, ముక్కు పైన పెట్టి, చెవులు కిందకి (కర్ణాటకం) దింపటంలోని పరమోద్దేశ్యం ఏమిటి? ఇంకా నయం! అస్సాం, బెంగాల్, త్రిపుర, మేఘాలయ, మహారాష్ట్ర, గుజరాత్, గోవా గట్రా గట్రాలతో చేతివేళ్ళు, కాలివేళ్ళు నలిపేసారు కాదు.

దేశభక్తి గేయం వ్రాయగలగటం చాలా గొప్ప విషయమే బ్రదర్. ఇలా కామెడీగా వ్రాయగలగటం అంతకుమించిన అద్భుతమే. భారత్ మా కో బచావ్!!

Anonymous March 11, 2008 at 12:58 AM  

ఉత్తరాస్తము, దక్శిణాస్తమా?యే సందుగొందుల్లో తిరిగి ఈ సంధుల్ని పట్టుకొచ్చారు మహాశయా

మధ్యనుండేది మధ్యప్రదేశమైతె ఎనకాలుండేది యేంటి? ఎర్ర సముద్రమా?

రేపొద్దునపొద్దున్నే తెలంగాణా వచ్చిందనుకోండి దాన్ని యే బాడి పార్టులోకి దూరుస్తారోనని చెడ్డ దురదగా ఉంది కవికుల తలమానికమా

జాహ్నవి March 11, 2008 at 3:16 AM  

@anonymous
భారతమాత అవయవ వర్ణనకి ఆయా రాష్ట్రాల ముఖ్యతను అనుసరించి వివరించాను. తలమానికమైనా,పాదాలైనా ఎంతో ముఖ్యం దేశానికి. మీ విమర్శకు దన్యవాదములు.మీ పేరుతో ఈసారి comment వ్రాయండి.

జాహ్నవి March 11, 2008 at 3:21 AM  

అభి.బి గారు
భారతమాత అవయవ వర్ణనకి ఆయా రాష్ట్రాల ముఖ్యతను అనుసరించి వివరించాను

Anonymous March 18, 2008 at 2:10 AM  

where is my Odissa
some body opearated and removed my state like apendicitis?
plz answer

jai jagannath

Back to TOP