వధువు కావలెను

>> Saturday, February 23, 2008

ఓ పెద్ద కంపెనీలో ఆకర్షణీయమైన జీతము అందుకుంటున్న వరునకు అందమైన, చురుకైన, P.G. చదివిన వధువు కావలెను.
ఏడడుగుల బంధానికి వధువుకు ఉండవలసిన ఏడు లక్షణాలు:
1)ఆస్తిలేమీ లేకపోయినా అప్పులుండకూడదు. కాని హైదరాబాద్ లో ఓ యిల్లు, లేదా 2,3 చోట్ల స్థలాలు ఉంటే చాలు.
2)అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఒకరు ఉంటే మంచిది. లేకుంటే మరీ మంచిది.
3)వరునికి ఇష్టం లేనప్పుడు ఉద్యోగం మానేసి, ఇష్టం ఐనప్పుడు ఉద్యోగం సంపాదించుకునే తెలివితేటలు ఉండాలి.
4)ఉద్యోగం చేస్తున్నా ఇంటి భాద్యతలు పూర్తిగా నిర్వర్తించాలి.
5)వరకట్నం ఇచ్చే విషయం మీ ఇష్టం కాని వధువుకు వారి తల్లిదండ్రులు ఏమైనా సమర్పించుకోవచ్చు. పెళ్ళి మాత్రం ఘనంగా చేయాలి.
6)వస్త్రధారణ పూర్తిగా మా ఇష్టానుసారంగా ఉండాలి.
7)డిగ్రీలు, ఉద్యోగాలు సంపాదించడమే కాదు వంటా వార్పు కూడా తెలిసుండాలి.
  • ఈ ప్రకటన చాలా మందికి కోపం తెప్పించిఉండవచ్చు. కానీ ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులుకు మాత్రం ఈ ప్రకటన బాగా తెలుసు. స్త్రీ ఎంత చదువుకుని ఉద్యోగం చేస్తున్నా వంటింటి పనులు పూర్తిగా ఆమే చేయాలి. అది ఆమె భాధ్యత. పురుషులు ఎంత చిన్న పని చేసినా అది సహాయమే అవుతుంది కాని భాద్యత కాదు. ఇది నిజంగా నిజం ఎవరైనా కాదంటారా?
  • వరకట్నం వద్దు అనేవారు చాలా అరుదుగా ఉన్నారు. ఒకవేళ వద్దు అన్నా పేరు మారుతుంది కాని లాంచనంగా మాత్రం తీసుకుంటున్నారు.
  • వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేసే మహిళలకి ఆయా ఉద్యోగాల రీత్యా వస్త్రధారణ ఉంటుంది. కానీ అది కూడా ఆక్షేపణల నడుమ నలిగిపోతుంది.

నా ఈ పోస్ట్ చదవుతుంటే ఎంతో మందికి కోపం రావచ్చు. కానీ ఈ పోస్ట్ రాయడానికి ముందు కొన్ని 100ల మంది దగ్గర అభిప్రాయాలను సేకరించాను నేను . వారిలో పెళ్ళి కాని స్త్రీ,పురుషులు ,పెళ్ళి ఐన స్త్రీ, పురుషులు, ఉద్యోగం చేస్తున్న ఆడవారు, ఉద్యోగం చేయని ఆడవారు కూడా ఉన్నరు. కేవలం ఈ పొస్ట్ నా అభిప్రాయ మాలిక కాదు. ఎంతో మంది మనసుపొరలలోని ఆశల రూపం ఈ పోస్ట్.

11 comments:

జాన్‌హైడ్ కనుమూరి February 23, 2008 at 6:54 AM  

baaguMdi

జాహ్నవి February 24, 2008 at 4:56 AM  

జాన్ హైడ్ కనుమూరి గారు
ధన్యవాదములు

Srividya March 9, 2008 at 5:23 AM  

meeru rasindi chaala correct.

జాహ్నవి March 9, 2008 at 7:39 AM  

శ్రీవిద్య గారు ధన్యవాదములు

krishna rao jallipalli March 9, 2008 at 10:42 AM  

మీరు భయ పడుతూ భయ పడుతూ టపా రాసినట్లున్నారు. 'కోపం రావచు ' అని అంటున్నారు. కోపం రానివ్వండి. ఏమి చేస్తారట?? నా భాషలో మరియు తెల్గు సినిమా భాషలో చెప్పాలంటే .. ఏమి పీక గలరు? మీరు చెప్పింది ౨౦౦ శాతం నిజం. రోజు పపెర్లోను టీవీ లోను చూస్తున్నాము కదా. ఎంతో మంది IAS, IPS, DOCTORS, ENGINNERS, పెద్ద పెద్ద పదవులలో ఉన్నవారు.. అడుక్కుతినే వారు కూడా ... చేసే పని అది. వందమంది అభిప్రయలా?? ఎందుకంత శ్రమ? పోస్ట్ చేయడానికి ఎందుకంత భయం?? మీ ప్రకటనలో ఇవి మర్చిపోయారు...
8) ENGAGEMENT అయ్యిన తరువాత వేరే ఎవరైన ఎక్కువ కట్నం ఇస్తానంటే.. మీ సంబంధం CANCEL. (ఈ మధ్య ఇటువంటి కేసులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాయి కూడా)
9) ఇప్పుడు నా జీతం 10000/- . పెళ్లి అయిన తరువాత నా జీతం 20000 అయతే ఆ DIFFERENCE కట్నం ఇవ్వాలి. (ఒక వేళ వాడు ACB OR CBI చేతిలో చిక్కి ఉద్యోగం పొతే, వేరే కారణాల వలన జీతం 5000/- అయతే ఆ లంజ కొడుకు ఆ DIFFERENCE కట్నం REFUND ఇస్తాడా ??). (ఇటువంటి కేసులు కూడా చూస్తున్నాం కదా).
ఇంకా.. చాల చాలా ఉన్నాయి.. కాని ఇది కామెంట్స్ కాలమ్ కదా... ఎక్కువ రాస్తే ఒక టపా అవుతుంది..

జాహ్నవి March 9, 2008 at 10:48 AM  

క్రిష్ గారు ధన్యవాదములు సార్

Anil Dasari May 8, 2008 at 4:12 PM  

మీరు చెప్పినంత ఘోరంగా ఇప్పుడు పరిస్థితులు లేవనుకుంటాను. కట్నాలు లేకుండా పెల్లిళ్లు చేసుకుని భార్యలని ప్రాణంగా చూసుకునే స్నేహితులు నాకు డజన్లకొద్దీ ఉన్నారు. కట్నం పుచ్చుకునే విషయంలో అబ్బాయి కన్నా అతని తల్లిదండ్రుల గోల ఎక్కువ. తల్లిదండ్రులకెదురు చెప్పలేడా అని మీరడగొచ్చు. అదే మాట కూతురు కూడా చెప్పొచ్చు కదా మరి, 'కట్నమిస్తే నేను పెళ్లి చేసుకోనే కోను' అని. కాబట్టి, ఆ సంగతి అవతలుంచితే, అసలు కట్న కానుకల విషయాల్లో ఆడవాళ్ల పాత్ర ఎంత అని ఆలోచించండి. 'ఆడ పడుచు' కట్నాలేగాని 'బావ మరిది' కట్నం అనేది లేదు కదా. పెళ్లి కొడుకు అక్క చెల్లెళ్లు తమకి అమ్మాయి వాళ్లవైపునుండి రావలసిన వాటి గురించి చేసే రాద్ధాంతం మీకు తెలియదా? 'నాకు ఇంతే ఇచ్చావు, చెల్లెలికేమో నాకన్నా ఎక్కువిచ్చావు. మా ఆయనంటె అంత చులకనా?' అని తల్లిదండ్రులతో గొడవ పెట్టుకునే అమ్మాయిలూ ఉన్నారు.

మరో విషయం. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుని ఆ తర్వాత 'కట్నం తీసుకుని నన్ను చేసుకున్నావు' అని వీలు దొరికినప్పుడల్లా దెప్పి పొడిచే పెళ్లాలున్న స్నేహితులు కూడా ఉన్నారు నాకు. ముందే తెలిసినప్పుడు అతన్ని కట్నం ఇచ్చి మరీ పెళ్లాడటమెందుకో? జీతమెక్కువ వస్తుందని కట్నమెక్కువిచ్చి పెళ్లాడే బదులు ఏ పనీ లేని వాడినే పెళ్లాడొచ్చుగద.

అబ్బాయికి తల్లిదండ్రుల ఆస్తి సంక్రమిస్తుంది. హిందూ వివాహ చట్టం ప్రకారం అమ్మాయికి ఆస్తిలో హక్కు లేదు. అందుకే కట్నం పేరుతో ఎంతో కొంత వాటా అడగటం ఒక పద్ధతిగా ఉంది. అలా తీసుకున్న ఆస్థో, డబ్బులో ఆ నూతన వధూవరులిద్దరికీ చెందితే మంచిదే కదా. అలా జరగకుండా కట్నం అబ్బాయి తల్లిదండ్రులు 'నొక్కెస్తే' అది తప్పు.

వేధించి కట్నం తీసుకునే కేసులు లేవని కాదు. అన్నీ అలాంటివే అని జెనరలైజ్ చెయ్యటం తప్పనేది నా ఉద్దేశ్యం. పేపర్లలో చెదురుమదురుగా వచ్చే వార్తలని చూసి జనాలంతా అలాగే ఉన్నారనుకోవటం సరికాదు. కట్నం ప్రస్తావన లేని పెళ్లి మంచిదే. కానీ అదంత తేలిగ్గా రూపుమాసిపోయే ఆచారం కాదు. ఈ లోగా, ఇచ్చేవారికి పుచ్చుకునేవారికి ఇబ్బంది లేకుండా కొనసాగినన్నాళ్లూ వారికి లేని బాధ మనకెందుకు?

http://anilroyal.wordpress.com
http://anilroyal.blogspot.com

BHARAT May 8, 2008 at 11:23 PM  

@అబ్రకదబ్ర గారు

హిందు వివహ చట్టం ప్రకారం ఆడపిల్లలికి కూడ ఆస్థి సమాన హక్కు ఉంది ( అప్పు లొ కూడా ;) )

ఎన్ టి ఓడు ఇచ్చాడు !!

@జహ్నవి గారు మంట అంటుకున్న నక్క లో ( ఫిరు ఫాక్షు ) లొ మీ అక్షరాలు కనిపించటము లేదు

Anil Dasari May 9, 2008 at 7:36 AM  

భరత్ గారూ,

నిజమేనండీ. ఎన్టీవోడు ఆ చట్టం తెచ్చిన సంగతి మర్చిపోయాను. ఆడ పిల్లకి ఆస్తిలో హక్కు లేనప్పుడు వచ్చిన సంప్రదాయం ఇది. ఇంకా కొనసాగుతూనే ఉంది.

Dr. Ram$ May 9, 2008 at 10:01 AM  

జాహ్నవి గారు చిన్న మార్పు..మీరు చెప్పినవి ఒకప్పుడు నిజము..కాని యిది విజన్ 2020 కదాండి..అందుకే పరిస్తితులు మారి పోయాయి..
నా క్లాస్ మెట్ ఒకమ్మాయి కి సంభందాలు చూస్తున్నారు. ఏమిటి రిక్వైర్మెంట్స్ అంటే.. అబ్బాయి వాళ్ళ కి అమ్మ నాన్న్న లేకుండా వుండాలి.. వున్నా నిరక్షరాస్యులు ఐతే మరీ మంచిది..అన్నదమ్ములు ఒకె గాని, అక్క చెల్లెల్లు అసలు వుండ రాదు.. అబ్బాయి, అందంగా లేకపోయిన పర్వాలేదు, డబ్బు వుండాలి, మాంచి అమాయకుడు అయి వుండాలి.. పెళ్ళి తరువతా కూడా జాబ్ చేయాలా?? అమెరికా తిసుకు వెళ్ళాలి.. హహహ

ఏమండి , ఈ పెళ్ళి అనేది ఒక వ్యాపారం.. వస్తువు అమ్మే వాడు, జాగ్త్రత్త గానే అమ్ముతాడు. కొనుక్కునే వాడు అన్ని చూసుకునే కొంటాడు.. అంతే కాని , ఒక వైపు వ్యాపారాలు ఎక్కడ జరగవు.. కట్నము వద్దు అంటే అబ్బాయి కి యే లోపము వుందో అని తిరిగి చూడటము లేదు...మరి దీన్ని ఏమంటారు..

ఇక ఈ వ్యాపారం లో కొంతమంది అత్యాశ కి పోతారు, అలా అత్యాశ కి పోయి పప్పు లో కాలు వేసి రచ్హ కెక్కుతారు..ఈ అత్యాశ కి సంభందించి ఒక నీజము చెప్పమంటారా?? పాతికేళ్ళు కని పెంచిన మన చిట్టి తల్లి ని, గొప్పల కోసమని, యెవడొ ముక్కు మొహము తెలియని వెధవకి, కేవలము పదిహేను రోజులు శెలవులు మీద (అది పెళ్ళి కోసమే) వచ్హే అమెరికా అళ్ళుళ్ళే కావాలని, కన్న పిల్లల గొంతు కోస్తున్న ఎంతమంది తల్లిదండ్రులని చూపించమంటారు?? అసల పదిహేను రోజుల్లొ ఒక మనిషి గురించి ఏమి తెలుసుకుంటారు?? పెళ్ళి కుదిరిన వెంటనే ఆ ఆడ పిల్ల తండ్రి , తన కూతురు ని సతాయిస్తూ వుంటాదు.. ఏమ్మా?? వీసా కి ఎప్పుడు వెల్తున్నారు?? అళ్ళుడు ఏమంటునాడు?? మెయిల్ ఏమన్నా చేశావా?? రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారా అని?? మీరు నమ్మిన నమ్మక పోయిన యివి అన్ని నిజాలు... నేను నా కళ్ళ తో దగ్గరుండి, ఎన్నో పెళ్ళిళ్ళు చుసిన నా స్వంత అనుభవాలు..

అంతే.. అన్ని సక్రమము గా చూసుకొని వ్యాపారం చేసిన వాడికి , వ్యాపారం లో ఎప్పుడు నష్టము రాదు.. నా ఈ వ్యాపార సూత్రము "ఆడ మగ యిరువురి కి వర్తిస్తదు సుమి"..

నా మాటలు యెవరినైనా నొప్పించి వుంటే క్షమించ గలరు.. ఎందకంటే, అందరి అనుభవాలు ఒకేలా వుండవు కదా.. అందరు మనుషులు కూడా ఒకేలా వుండరు కదా..కాని నా అనుభవాలు పచ్హి నిజాలు.. ఆ కన్న తల్లిదండ్రుల ఆత్రుత చూసి ఒక్కోసారి నాకే ఆశ్చర్యము వేసేది. ఏమిటా వీళ్ళు ఇంతా పిచ్హి గా అలోచిస్తారు అని..

Unknown August 28, 2008 at 2:38 AM  

jahnavi garu eakkadivarako eandhu ku na varaku nake experience present ammayilu eala unnaro. nenu oka ammayini love chesa. final ga marriage ki praposals pettamu. valla parents ma intiki vachi matladi velli marriage cancel chesukunnaru eanti ra visayam ante naku 2 sisters valla marrige responsibilities naku unnayi anta. ea ammayi kuda adhe way lo undhi. eantha dharunam ga undhi chudandi. ippati ammayilu antha chala maripoyaru. ipudu max abbayilu amayikulu ammayilu chala fast. so i think if you change your mind that would be really good.

Back to TOP